నేర నిరోధానికి నూతన శక్తి – నిర్మల్ శ్రీనగర్‌లో 30 సీసీ కెమెరాలు ప్రారంభం

నేర నిరోధానికి నూతన శక్తి – నిర్మల్ శ్రీనగర్‌లో 30 సీసీ కెమెరాలు ప్రారంభం

నేర నిరోధానికి నూతన శక్తి – నిర్మల్ శ్రీనగర్‌లో 30 సీసీ కెమెరాలు ప్రారంభం

“ఒక్క కెమెరా వంద మంది పోలీసులతో సమానం” – జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల

నేర నిరోధానికి నూతన శక్తి – నిర్మల్ శ్రీనగర్‌లో 30 సీసీ కెమెరాలు ప్రారంభం

నిర్మల్ పట్టణంలోని శ్రీనగర్ కాలనీలో 30 సీసీ కెమెరాలను ఈ రోజు జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల ఐపిఎస్ అధికారికంగా ప్రారంభించారు. అనంతరం హనుమాన్ మందిరం దర్శించుకుని పూజలు నిర్వహించి వేద పండితుల ఆశీర్వాదం తీసుకున్నారు.

నేర నిరోధానికి నూతన శక్తి – నిర్మల్ శ్రీనగర్‌లో 30 సీసీ కెమెరాలు ప్రారంభం

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ:

“సీసీ కెమెరాలు నేరాల నివారణకు అత్యంత కీలకం. ఒక్క కెమెరా వంద మంది పోలీసులతో సమానం. ప్రతి వీధి, ప్రతి మూలలో నిఘా పెరిగితే నేరాలపై అదుపు తేలికవుతుంది” అని పేర్కొన్నారు.

జిల్లాలో ఇప్పటికే 10,000 కెమెరాలు – కమాండ్ కంట్రోల్‌తో అనుసంధానం

ప్రజల భాగస్వామ్యంతో జిల్లాలో ఇప్పటికే 10,000 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి జియోట్యాగ్ చేయడం ద్వారా కమాండ్ కంట్రోల్ కేంద్రంతో అనుసంధానించామని తెలిపారు. బస్టాండ్లు, ఆలయాలు, మార్కెట్లు, మసీదు ప్రాంతాల్లో నిఘా పటిష్ఠం చేయబడిందని చెప్పారు.

నేరస్తులకు భయం కలిగించడమే లక్ష్యం

“ఇటీవల జరిగిన జ్యూవెలరీ దొంగతనం, షట్టర్ లిఫ్టింగ్ కేసుల్లో సీసీ కెమెరాలు కీలకంగా పనిచేశాయి. దొంగలను వెంటనే గుర్తించి శిక్షించగలిగాం. భవిష్యత్తులో నేరస్తులకు ‘ఇక్కడ దొరికిపోతాం’ అనే భయం కలిగించడమే మా లక్ష్యం,” అని ఎస్పీ పేర్కొన్నారు.

మిషన్ గాంజా గస్తీపై హెచ్చరిక

కాలనీవాసులకు పిలుపునిస్తూ, మీ చుట్టూ ఎవరైనా గంజాయ్ లేదా తెల్లకల్లు బానిసగా మారితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి అని సూచించారు. యువత భవిష్యత్తును కాపాడేందుకు ఇది అత్యంత అవసరం అన్నారు.

కలిసికట్టుగా అభినందనల వర్షం

ఒక్కసారిగా 30 కెమెరాలు ప్రారంభించడాన్ని ఎస్పీ గొప్ప విజయంగా అభివర్ణించారు. భవిష్యత్తులో మరిన్ని కాలనీలు ఈ మోడల్‌ను అనుసరించాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ –

“నిర్మల్ జిల్లాలో ఎస్పీ గారి police akka, నారీశక్తి, శివంగి మహిళ బృందం, మిషన్ గాంజా గస్తీ లాంటి కార్యక్రమాలు రాష్ట్రంలోనే మాదిరిగా లేవు” అని ప్రశంసలు కురిపించారు.

పాల్గొన్నవారు:

ఈ కార్యక్రమంలో ఎస్పీ డా. జానకి షర్మిలతో పాటు పట్టణ ఇన్‌స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, ఎస్సైలు సంజీవ్, సందీప్, అజయ్, మహిళ ఎస్ఐ శ్రావణి, కాలనీ అధ్యక్షుడు భాను చందర్, స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment