నూతన కార్డులు పేదలకు వరం.* జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.

నూతన కార్డులు పేదలకు వరం.* జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.

నూతన కార్డులు పేదలకు వరం.*

జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.

మనోరంజని ప్రతినిధి నిర్మల్ జులై 28 – అర్హులైన ప్రతి ఒక్కరికి నూతన రేషన్ కార్డులను అందిస్తామని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. సోమవారం సారంగాపూర్ మండలంలోని కౌట్ల గ్రామ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు ఏలేటి మహేశ్వర్ రెడ్డితో కలసి ఆమె పాల్గొన్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వం మంజూరు చేసిన నూతన రేషన్ కార్డులు పేదలకు వరంగా మారాయన్నారు. సారంగాపూర్ మండలంలో 1425 కార్డులు జారీ చేయడం జరిగిందన్నారు. నిర్మల్ నియోజకవర్గంలో మొత్తం 10,325 కార్డులు మంజూరుతో పాటు 2000 పైగా రేషన్ కార్డులలో కుటుంబ సభ్యుల పేర్లను చేర్చడం జరిగిందని తెలిపారు. ఇంకా అర్హులైన వారు మిగిలి ఉంటే మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దని, రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ, అర్హులైన ప్రతి పేద కుటుంబానికి రేషన్ కార్డులు అందించాలన్న రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం అభినందనీయం అన్నారు. రేషన్ కార్డులు లేక ఇప్పటివరకు ఇందిరమ్మ ఇండ్లు, పెన్షన్లు రానివారికి వెంటనే మంజూరు చేయాలన్నారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్దుల్ ఆది, అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, ఆర్డీవో రత్న కళ్యాణి, తహసీల్దార్ శ్రీదేవి, ఎంపీడీవో లక్ష్మీకాంత్, ఇతర అధికారులు, ప్రజలు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment