ఎమ్4 న్యూస్ (ప్రతినిధి)
నిర్మల్ జిల్లా, సెప్టెంబర్ 27
సారంగాపూర్ మండలంలోని చించోలి(బి) ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఉపాధ్యాయులకు రూమ్ టు రీడ్ ఇండియా సంస్థ సహకారంతో ఫౌండేషన్ లిటరసీపై ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి మధుసూదన్ మాట్లాడుతూ విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందించడం ముఖ్యమని, ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయులు ప్రణాళికాబద్ధంగా బోధన చేయాలని సూచించారు.
మండల నోడల్ అధికారి జనార్ధన్, రూమ్ టు రీడ్ సంస్థ అందించిన పుస్తకాలు విద్యార్థులకు అందుబాటులో ఉంచాలని, సిలబస్‌ను అకడమిక్ క్యాలెండర్ ప్రకారం పూర్తి చేయాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు రమేష్, ఎమ్మార్పీలు అంబరీష్, మోజుద్దీన్, రూమ్ టు రీడ్ కోఆర్డినేటర్ రాము తదితరులు పాల్గొన్నారు.