కస్బా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎన్‌సీసీ దినోత్సవం

ఎన్‌సీసీ దినోత్సవం కస్బా పాఠశాల, నిర్మల్

ఆకట్టుకున్న క్యాడెట్ల విన్యాసాలు

M4 న్యూస్ ప్రతినిధి, నిర్మల్, నవంబర్ 25

నిర్మల్ పట్టణంలోని కస్బా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం 77వ ఎన్‌సీసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీ, ఎన్సిసి క్యాడెట్ల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అసోసియేట్ ఎన్‌సీసీ ఆఫీసర్ యాటకారి సాయన్న మాట్లాడుతూ, ఎన్‌సీసీ యువతకు క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను అలవర్చడంలో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.

ఎన్‌సీసీ శిక్షణ ముఖ్యాంశాలు:

  • ఫిజికల్ ఫిట్‌నెస్, వెపన్ ట్రైనింగ్
  • డ్రిల్లు, సాంస్కృతిక కార్యక్రమాలు
  • విద్యార్థులకు ప్రత్యేక 10-రోజుల శిక్షణ క్యాంపు

ఎన్‌సీసీ ప్రాముఖ్యత:
ఎన్‌సీసీ శిక్షణతో యువత చెడు ప్రవర్తనలకు దూరమై, దేశభక్తి, సోదరభావం, క్రమశిక్షణ వంటి విలువలను అలవర్చుకుంటారని సాయన్న వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment