మనోరంజని ప్రతినిధి, భైంసా
భైంసా పట్టణంలోని గణేష్ నగర్‌లో శ్రీరామ చైతన్య యూత్ ఆధ్వర్యంలో దేవీ నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ సరస్వతి శిశు మందిర్ గుజిరిగల్లి పాఠశాల విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చి అందరినీ ఆకట్టుకున్నారు. చిన్నారులు భక్తి గీతాలు ఆలపించడం, నృత్యాలు ప్రదర్శించడం జరిగింది.
పిల్లలకు గుర్తుగా జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పి. గోపాల్, నూకల సురేష్, వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ తోట రాము, రఘువీర్, ముత్యం కమిటీ సభ్యులు పాల్గొన్నారు.