జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి గా నవీన్ యాదవ్?

జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి గా నవీన్ యాదవ్?

జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి గా నవీన్ యాదవ్?

మనోరంజని తెలుగు టైమ్స్  ప్రతినిధి

హైదరాబాద్:అక్టోబర్ 09
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్, పేరును ఏఐసీసీ బుధవారం రాత్రి ప్రకటించింది ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్,ఒక ప్రకటన విడుదల చేశారు. మొత్తం నలుగురు అభ్యర్థుల పేర్లను ఏఐసీసీ కి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సిఫార్సు చేయగా నవీన్ పేరును ఎంపిక చేసింది….

రాష్ట్రంలో జూబ్లీహిల్స్​ ఉపఎన్నిక పోరు రసవత్తరంగా మారనుంది. ఇప్పటికే బీఆర్​ఎస్​ అభ్యర్థి ని ప్రకటించగా, ఇప్పుడు అధికార కాంగ్రెస్​ పార్టీ అభ్యర్థి నవీన్​ యాదవ్​ పేరును ఏఐసీసీ బుధవారం రాత్రి ప్రకటించింది.

మాజీ ఎంపీలు అంజన్‌ కుమార్‌ యాదవ్, అజారుద్దీన్, మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ వంటి వారు గట్టిగా ప్రయత్నాలు చేసినప్పటికీ యువకుడైన నవీన్‌ వైపే అధిష్ఠానం మొగ్గు చూపింది. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల బ‌రిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా స్థానిక యువ నాయ‌కుడు న‌వీన్ యాద‌వ్ పేరును ప్రక‌టించ‌డంపై స‌ర్వత్రా హ‌ర్షాతిరేకాలు వ్యక్తమ‌వుతున్నాయి.

నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన స్థానిక నేత‌గా, అన్ని వ‌ర్గాల‌కు సుప‌రిచితుడిగా న‌వీన్ యాద‌వ్‌కు మంచి గుర్తింపు ఉంది. యాద‌వ సామాజిక వ‌ర్గానికి చెందిన న‌వీన్‌కు బీసీ వ‌ర్గాల్లో మంచి ప‌ట్టుంది. నియోజ‌ క‌వ‌ర్గంలో మెజారిటీ ఉన్న ముస్లిం మైనారిటీ వ‌ర్గాలు కూడా ఆయ‌నను త‌మ‌ వాడిగా భావిస్తుండ‌టం కలిసొచ్చే అంశం.

కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ అభ్యర్థిత్వాన్ని ప్రకటించగానే, వివిధ వర్గాల ప్రజలు ఆయనకు మద్దతు తెలుపుతున్నా యి. జూబ్లీహిల్స్ నియోజ కవర్గం నుంచి ఆయన కచ్చితంగా విజయం సాధిస్తారని, ఈ ప్రాంత అభివృద్ధికి మ‌రింత‌గా పాటుప‌డ‌తార‌ని పేర్కొంటున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment