ఢిల్లీ / చీరాల, 27 June
దేశవ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులకు సుప్రీంకోర్టు శుభవార్తను అందించింది. పెన్ను, కెమెరా పట్టి వార్తలు అందించే వారందరూ జర్నలిస్టులేనని స్పష్టం చేసిన సర్వోన్నత న్యాయస్థానం, వారిపై కక్ష్యతో పెట్టే అక్రమ కేసులు చెల్లవని తేల్చి చెప్పింది. జర్నలిస్టు సంఘాలకే పరిష్కార హక్కులు ఉంటాయని పేర్కొంది.
దేశవ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులకు సుప్రీంకోర్టు శుభవార్తను అందించింది. పెన్ను పట్టి, వీడియో కెమెరా పట్టి రోజువారీ వార్తలు, న్యూస్ ప్రసారాలు నిర్వహిస్తున్న వారందరూ జర్నలిస్టుల జాబితాలోనే ఉంటారని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
ఇకపై రాజకీయ నాయకులు, అక్రమ సంపాదన దందాలు చేసేవారు, ప్రభుత్వ శాఖల్లో అవినీతి, అక్రమాలకు పాల్పడేవారి బాగోతాలపై నిజాలను నిర్భయంగా రాసినా, న్యూస్ ప్రసారాలు చేసినా జర్నలిస్టులపై కక్ష్యతో పెట్టే అక్రమ కేసులు చెల్లవని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.
శాటిలైట్ ఛానెల్స్, యూట్యూబ్ న్యూస్ ఛానెల్స్, ప్రింట్ మీడియా సంస్థల్లో పనిచేస్తున్న జర్నలిస్టులు ఆయా సంఘాల్లో సభ్యత్వం కలిగి ఉంటే, వారిపై అక్రమ కేసులు లేదా నిజ నిరూపణ కేసుల వ్యవహారాలను ఆయా సంఘాల ద్వారా పరిష్కరించుకునే హక్కులు ఉంటాయని పేర్కొంది. ఈ పరిష్కారానికి 7 రోజుల్లో నిర్ణయం తీసుకునే అధికారం జర్నలిస్టు సంఘాలకే ఉంటుందని, వారిని కాదని అక్రమ కేసులు పెట్టిన పోలీసులపై వేట తప్పదని సుప్రీంకోర్టు హెచ్చరించింది.












