కేసుల పరిష్కారం కోసం జాతీయ లోక్ అదాలత్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి శ్యామ్ కోశి

కేసుల పరిష్కారం కోసం జాతీయ లోక్ అదాలత్

రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి శ్యామ్ కోశి

నిర్మల్ మనోరంజని ప్రతినిధి సెప్టెంబర్ 13

కేసుల పరిష్కారం కోసం జాతీయ లోక్ అదాలత్

రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి శ్యామ్ కోశి

కేసుల పరిష్కారం కోసం జాతీయ లోక్ అదాలత్

రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి శ్యామ్ కోశి

కోర్టు కేసుల పరిష్కారం కోసం జాతీయ లోక్ అదాలత్ గొప్ప అవకాశం అని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి శ్యామ్ కోశి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని పెంచనర్ల భవనంలో జరిగిన మూడవ జాతీయ లోక్ అదాలత్ సేవల, కమ్యూనిటీ మీడియేషన్ కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా హైకోర్టు న్యాయ మూర్తి మాట్లాడుతూ, కోర్టు కేసుల్లో రాజీ మార్గాల ద్వారా ఇరు వర్గాలకూ న్యాయం చేకూరుతుందని తెలిపారు. లోక్ అదాలత్ ద్వారా కేసులు త్వరితగతిన పరిష్కారం కావడంతో పాటు కక్షిదారులు ప్రశాంతంగా జీవించవచ్చని సూచించారు. అతిథిగా పాల్గొన్న హైకోర్టు న్యాయమూర్తి సుజన కళాసికం మాట్లాడుతూ, ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న కేసులకు లోక్ అదాలత్ ద్వారా శాశ్వత పరిష్కారం లభిస్తోంది. వరకట్నం, గృహహింస, చెక్ బౌన్స్, రోడ్డు ప్రమాదాలు వంటి కేసులు తక్కువ ఖర్చుతో పరిష్కరించుకోవచ్చు అని పేర్కొన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్. శ్రీవాణి మాట్లాడుతూ, న్యాయవాదులు ప్రజలకు లోక్ అదాలత్ గురించి అవగాహన కల్పించి, వారిని కేసులను రాజీమార్గంలో పరిష్కరించుకునేలా ప్రోత్సహించాలని సూచించారు. క్రిమినల్, సివిల్ కేసులు, భూ వివాదాలు, కుటుంబ తగాదాలు, ఆస్తి గొడవలు తదితర కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవచ్చని తెలిపారు. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ, లోక్ అదాలత్ సేవలు కోర్టులపై భారాన్ని తగ్గించడమే కాకుండా ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న కేసులకు పరిష్కారం చూపుతున్నాయి. దేశవ్యాప్తంగా లక్షలాది కేసులు ఈ విధానం ద్వారా సులభంగా పరిష్కారం అవుతున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా కేసులను ఉపసంహరించుకున్న వారికి న్యాయమూర్తులు, కలెక్టర్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి అభినందనలు తెలిపారు. పలు కేసుల్లో బాధితులకు మంజూరైన నష్టపరిహార చెక్కులు, అటవీ జంతువుల దాడిలో నష్టపోయిన వారికి పరిహార చెక్కులు అందజేశారు. అనంతరం అతిథులను సన్మానించారు. అంతకుముందు జిల్లాకు విచ్చేసిన హైకోర్టు న్యాయమూర్తులను అటవీ శాఖ వసతి గృహంలో జిల్లా కలెక్టర్, ఎస్పీలు పూల మొక్కలతో స్వాగతం పలికారు. పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ సభ్యుడు పంచాక్షరి, డిఎల్ఎస్ఎ సెక్రటరీ రాధిక, ఎస్పీ జానకి షర్మిల, జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లారెడ్డి, కోర్టు అధికారులు, న్యాయవాదులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment