తెలుగు సినిమాలకు జాతీయ అవార్డులు.. మంత్రి కోమటిరెడ్డి అభినందనలు
తెలుగు సినిమాలకు ఏడు జాతీయ చలనచిత్ర అవార్డులు లభించడంపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఉత్తమ తెలుగు చిత్రంగా ‘భగవంత్ కేసరి’, ‘బలగం’ సినిమాలో పాట రాసిన రచయిత కాసర్ల శ్యామ్‌కు జాతీయ అవార్డు లభించడం అభినందనీయమని చెప్పారు. బేబీ, హను-మాన్ చిత్రాలకు రెండేసి అవార్డులు.. గాంధీ తాత చెట్టు సినిమాలో నటించిన సుకృతి వేణి ఉత్తమ బాలనటిగా ఎంపిక కావడం తెలుగు సినీ పరిశ్రమ ప్రతిభను చాటిచెబుతోందన్నారు