ఘనంగా నాగుల పంచమి వేడుకలు

ఘనంగా నాగుల పంచమి వేడుకలు

ముధోల్ మనోరంజని ప్రతినిధి జూలై 29

ఘనంగా నాగుల పంచమి వేడుకలు

మండలకేంద్రమైన ముధోల్తో పాటు వివిధ గ్రామాల్లో మంగళవారం నాగుల పంచమి వేడుకలను మహిళలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు, చిన్నారులు కొత్త వస్త్రాలు ధరించి గ్రామ సమీపంలో గల పుట్టలో పాలు పోసి నాగదేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం తమ సోదరుల కళ్ళను పాలతో కడిగి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆశీర్వదించారు. గ్రామాల్లోని ఆలయాల్లో నాగుల పంచమి పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించడానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. పురాతన ఆలయమైన శ్రీ జఠశంకర ఆలయం, శ్రీ పశుపతినాథ్ శివాలయంలో పూజలు నిర్వహించేందుకు భక్తులు తరలివచ్చారు.

Join WhatsApp

Join Now

Leave a Comment