నాగపూర్ తండా సర్పంచ్ బరిలో జాదవ్ లలితా బాయి–కైలాష్ దంపతులు
మనోరంజని తెలుగు టైమ్స్, సారంగాపూర్ : డిసెంబర్ 05
నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని నాగపూర్ తాండాకు చెందిన జాదవ్ లలితా బాయి–కైలాష్ దంపతులు కాంగ్రెస్ పార్టీ తరఫున సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్నారు. కుటుంబ సభ్యుడు జాదవ్ ప్రకాష్ నాయక్‌కు దశాబ్దానికి పైగా రాజకీయ అనుభవం ఉంది. ఆయన గతంలో సర్పంచ్‌గా, అలాగే మండల సేవాలాల్ సేన అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. గ్రామాభివృద్ధిని మరింత వేగవంతం చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని, ప్రజలు మరోసారి తమకు అవకాశమివ్వాలని లలితా బాయి–కైలాష్ దంపతులు గ్రామస్తులను కోరారు.