- పాలెం గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన జిల్లా విద్యాధికారి రమేష్ కుమార్
- అలయ మాజీ ధర్మకర్త గాడి సురేందర్ శాలువాతో సన్మానం
- శివాలయంలో అభిషేక పూజల్లో పాల్గొన్న DEO
- వెంకన్న స్వామిని దర్శించడం పూర్వ జన్మ సుకృతంగా భావించిన రమేష్ కుమార్
నాగర్ కర్నూల్ జిల్లా విద్యాధికారి (DEO) రమేష్ కుమార్ గారు బిజీనపల్లి మండలం పాలెం గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ మాజీ ధర్మకర్త గాడి సురేందర్ గారు శాలువాతో సన్మానించగా, అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం శివాలయంలో అభిషేక పూజల్లో పాల్గొని భక్తి భావంతో వెంకన్నను దర్శించుకోవడం పూర్వ జన్మ సుకృతమని వ్యాఖ్యానించారు.
నాగర్ కర్నూల్ జిల్లా బిజీనపల్లి మండలం పాలెం గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ రోజు ఉదయం జిల్లా విద్యాధికారి (DEO) రమేష్ కుమార్ గారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ మాజీ ధర్మకర్త గాడి సురేందర్ గారు DEO రమేష్ కుమార్ గారిని శాలువాతో సన్మానించగా, అర్చకులు వారి చేత తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఈ సందర్భంగా DEO రమేష్ కుమార్ మాట్లాడుతూ, పాలెం వెంకన్నను దర్శించుకోవడం తన పూర్వ జన్మ సుకృతమని, ఎంతో పుణ్యం చేసుకుంటే గానీ ఇలాంటి అదృష్టం దొరకదని ఆనందం వ్యక్తం చేశారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న శివాలయంలో కూడా అభిషేక పూజల్లో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో GHM నరహరి, నాగేందర్, వెంకట్ శెట్టి, గోపాలస్వామి, కే. మధు, జి. శంకర్, అర్చక స్వాములు జయంత్, కొఱవి రామానుజా చార్యులు, వికాస్ శుక్ల, చక్రపాణి, బాబయ్య తదితరులు పాల్గొన్నారు.