నాగర్ కర్నూల్ బస్టాండ్ సమస్యలపై శ్రీరామ వెల్ఫేర్ సొసైటీ డిమాండ్

నాగర్ కర్నూల్ బస్టాండ్ వద్ద ట్రాఫిక్ సమస్యలపై శ్రీరామ వెల్ఫేర్ సొసైటీ నేతల సమావేశం
  • ట్రాఫిక్ సమస్యలతో ప్రమాదాల ముప్పు పెరిగిన బస్టాండ్
  • బస్టాండ్ నుంచి బస్సులు బయటకు వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు
  • బస్టాండ్ వద్ద వ్యాపారాలు, ఆటోలు, ద్విచక్ర వాహనాల రద్దీ వల్ల ప్రమాదకర పరిస్థితి
  • కొత్త బస్సు స్టాండ్‌ను బస్సు డిపో దగ్గర ఏర్పాటు చేయాలని శ్రీరామ వెల్ఫేర్ సొసైటీ డిమాండ్

 

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని బస్టాండ్ వద్ద భారీగా ట్రాఫిక్ సమస్యలు నెలకొన్నాయి. బస్సులు లోపలికి రావడానికి, బయటకు వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వ్యాపారాలు, ఆటోలు, ద్విచక్ర వాహనాల రద్దీ వల్ల ప్రమాదకర పరిస్థితి ఏర్పడిందని శ్రీరామ వెల్ఫేర్ సొసైటీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. బస్సు డిపో వద్ద కేటాయించిన స్థలంలో కొత్త బస్టాండ్ నిర్మించాలని కోరుతూ ఆర్.టీ.సీ అధికారులను హెచ్చరించారు.

 

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని బస్టాండ్ సమస్యలపై శ్రీరామ వెల్ఫేర్ సొసైటీ జనరల్ సెక్రటరీ మాట్లాడుతూ, బస్టాండ్ చుట్టూ ట్రాఫిక్ సమస్యలు తీవ్రంగా ఉన్నాయని, దీనివల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

బస్టాండ్ సమీపంలో కోర్టు భవనాలు, బిజినెస్ షాపులు ఉన్నందున ఇరువైపులా ట్రాఫిక్ తీవ్రంగా ఉంది. ఆటోలు, ద్విచక్ర వాహనాల రద్దీ వల్ల బస్సులు లోపలికి రాలేక, బయటకు వెళ్లలేక డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

మూడు సంవత్సరాల క్రితం బస్టాండ్ లోపల ఓ బాలుడు బస్సు వెనక్కు తీసిన సమయంలో ప్రాణాలు కోల్పోయిన ఘటనను గుర్తు చేస్తూ, ఇలాంటి ప్రమాదాలు మరలా జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.

శ్రీరామ వెల్ఫేర్ సొసైటీ ప్రెసిడెంట్ దాసరి నిరంజన్ యాదవ్ మాట్లాడుతూ, బస్టాండ్ సమీపంలో పూల వ్యాపారులు దుకాణాలు ముందుకు పెట్టడం వల్ల బస్సులు బయటకు వెళ్లేందుకు డ్రైవర్లు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు.

బస్సు డిపో వద్ద ప్రభుత్వం కేటాయించిన స్థలంలో కొత్త బస్టాండ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత ఎమ్మెల్యే డాక్టర్. కే. రాజేష్ రెడ్డి దీనిపై ప్రత్యేక చొరవ తీసుకుని సమస్యను పరిష్కరించాలని కోరారు.

Join WhatsApp

Join Now

Leave a Comment