నాగ పంచమి పూజా విధానం, శుభ సమయం ఇదే!
శ్రావణ మాసంలో అనేక పర్వదినాలు ఉన్నాయి. అందులో నాగ పంచమి ఒకటి. ఈసారి జూలై 29వ తేదీన శ్రావణ శుక్ల పంచమి మంగళవారం రోజు జరుపుకోనున్నారు.
ఈ నాగుల పంచమి రోజు శ్రీవల్లీ దేవసేన సమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎనలేని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఈసారి ఈ నాగుల పంచమి పండుగ మంగళవారం రావడంతో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధిస్తారు.
నాగ పంచమి రోజు నాగ దేవతలను, శివుడిని, సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడానికి పవిత్రమైన రోజుగా పరిగణిస్తారు. ఈ రోజు పూజ చేయడం వల్ల కాల సర్పదోషం నుంచి ఉపశమనం లభిస్తుందని నమ్మకం. అయితే.. జూలై 29న పంచమి తిథి జూలై 28వ తేదీన రాత్రి 11:24 గంటలకు ప్రారంభమవుతుంది. జూలై 30వ తేదీ తెల్లవారుజామున 12:46 గంటలకు పంచమి తిథి ముగుస్తుంది. కాబట్టి జూలై 29వ తేదీన మంగళవారం రోజు నాగ పంచమి నిర్వహించుకోవాలి. అలాగే.. నాగ పంచమి పూజ కు ఉదయం 5:41 గంటల నుంచి 8:23 గంటల వరకు ఉత్తమ సమయంగా చెబుతున్నారు. అంటే నాగ దేవత పుట్టలో పాలు పోసేందుకు ఈ సమయం విశిష్టమైనదిగా చెబుతున్నారు.