అప్పుల్లో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానం – నాబార్డ్ రిపోర్ట్ విశ్లేషణ

తెలంగాణ రాష్ట్రంలో అప్పు భారంలో ఉన్న రైతు కుటుంబాలు
  • తెలంగాణలో ఒక్కో కుటుంబానికి సగటున రూ.1,29,599 అప్పు
  • 2021-22 నాటికి అప్పుల్లో ఉన్న కుటుంబాల శాతం 92%కి పెరిగింది
  • వ్యవసాయ కుటుంబాలకు సగటున 2 ఎకరాల భూమి మాత్రమే మిగిలి ఉంది
  • పెరిగిన ఖర్చులు, నూనెగింజలు, పప్పు లాంటి నిత్యవసరాల కొనుగోలు భారంగా మారిన రైతులపై భారం

 

నాబార్డ్ తాజా రిపోర్టు ప్రకారం, తెలంగాణ రాష్ట్రంలో ఒక్కో కుటుంబానికి సగటున రూ.1,29,599 అప్పు ఉంది. గతంలో దేశంలో సగటు వ్యవసాయ కుటుంబాల భూమి 2.5 ఎకరాలు ఉండగా, ప్రస్తుతం అది కేవలం 2 ఎకరాలకు తగ్గింది. రాపిడిగా పెరుగుతున్న ఖర్చులు, వడ్డీలు, నిత్యావసరాల ధరలు పెరిగి రైతులపై అప్పు భారాన్ని మరింత ఎక్కువ చేస్తున్నాయి.

 

తెలంగాణ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో అప్పు భారాలు అధికంగా ఉండడాన్ని నాబార్డ్ తన తాజా రిపోర్టులో వెల్లడించింది. దేశంలో ఒక్కో కుటుంబానికి సగటు అప్పు రూ.90,372గా ఉన్నప్పటికీ, తెలంగాణ రాష్ట్రంలో ఒక్కో కుటుంబానికి సగటు రూ.1,29,599 అప్పు ఉందని రిపోర్టు పేర్కొంది. 2016లో రాష్ట్రంలో అప్పులో ఉన్న కుటుంబాల శాతం 79% ఉండగా, 2021-22 నాటికి ఈ శాతం 92%కి పెరిగింది.

ఇంతటి అప్పు భారాలు కేవలం వడ్డీ కాకుండా, పెరిగిన ఖర్చులు, వనరుల కొరత వంటి అంశాలు రైతులపై భారం మోపుతున్నాయి. వాతావరణ మార్పులు, కాలుష్య ప్రభావంతో రైతులు వారి భూముల్లో పండించుకునే కూరగాయలు, పప్పులు, నూనెగింజలు మొదలైనవన్నీ ఎక్కువ ధరలకు బయట నుంచి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. రోగాల సంఖ్య పెరిగిపోవడంతో వైద్య ఖర్చులు కూడా పెరిగాయి.

ఈ రిపోర్టు ప్రకారం, తెలంగాణలోని రైతు కుటుంబాలకు సగటు ఆదాయం పెరిగినా, ఖర్చులు తీసేస్తే మిగిలే సొమ్ము కేవలం రూ.781 మాత్రమే. మారుతున్న ఆర్థిక, వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలోని రైతులకు ప్రభుత్వం, ఇతర సహాయ సంస్థల నుంచి మద్దతు అవసరం ఉందని నాబార్డ్ సూచించింది.

Join WhatsApp

Join Now

Leave a Comment