నా మౌన కవనాక్షరాలు’ ఘనంగా పుస్తకావిష్కరణ

నా మౌన కవనాక్షరాలు’ ఘనంగా పుస్తకావిష్కరణ

కలం స్నేహం సంస్థ అధ్యక్షురాలు దేవి ప్రియ రచనకు ప్రముఖుల ప్రశంసలు

మనోరంజని తెలుగు టైమ్స్, నిర్మల్ ప్రతినిధి – నవంబర్ 08:

నా మౌన కవనాక్షరాలు’ ఘనంగా పుస్తకావిష్కరణ

నా మౌన కవనాక్షరాలు’ ఘనంగా పుస్తకావిష్కరణ

నిర్మల్ జిల్లా కలం స్నేహం సంగీత సాహిత్య సామాజిక సేవా సంస్థ అధ్యక్షురాలు, ఉపాధ్యాయిని శ్రీమతి దేవి ప్రియ రచించిన ‘నా మౌన కవనాక్షరాలు’ అనే కవితా సంపుటి పుస్తకాన్ని ఆదర్శనగర్ శిశు మందిర్ ఉన్నత పాఠశాలలో ఘనంగా ఆవిష్కరించారు. కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయిని పుష్పలత అధ్యక్షత వహించగా, ప్రముఖులు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. తుమ్మల దేవరావు పుస్తక సమీక్షను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రామానుజాచార్యులు, రాఘవాచార్యులు, కలం స్నేహం రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు కడారి దశరథ్, కొండూరు పోతన్న, కవులు, లాయర్ నివేదిత, నేరెళ్ల హనుమంతు, రాజారావు, రవికాంత్, పోలీసు భీమేశ్ తదితరులు పాల్గొన్నారు. అతిథులు మాట్లాడుతూ — దేవి ప్రియ రచనలోని కవితలు ఆత్మస్పర్శిగా, భావోద్వేగపూరితంగా ఉండి పాఠకుల హృదయాలను తాకుతాయని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో కవయిత్రులు కిరణ్మయి, శివరాణి, భైంసా కవులు, కళాకారులు, సాహిత్యాభిమానులు, భాషాభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment