అమ్మవారి ఆశీస్సులతో ప్రజా సేవకే నా జీవితం అంకితం – ఆలయ చైర్మన్ సింగం భోజ గౌడ్

అమ్మవారి ఆశీస్సులతో ప్రజా సేవకే నా జీవితం అంకితం – ఆలయ చైర్మన్ సింగం భోజ గౌడ్

అమ్మవారి ఆశీస్సులతో ప్రజా సేవకే నా జీవితం అంకితం – ఆలయ చైర్మన్ సింగం భోజ గౌడ్

దేవస్థానంలో అవినీతికి పాల్పడిన వారిని ఉపేక్షించబోమని స్పష్టం

మనోరంజని తెలుగు టైమ్స్ సారంగాపూర్ అక్టోబర్ 22

అమ్మవారి ఆశీస్సులతో ప్రజా సేవకే నా జీవితం అంకితం – ఆలయ చైర్మన్ సింగం భోజ గౌడ్

అమ్మవారి ఆశీస్సులతో ప్రజా సేవకే నా జీవితం అంకితం – ఆలయ చైర్మన్ సింగం భోజ గౌడ్అమ్మవారి ఆశీస్సులతో ప్రజా సేవకే నా జీవితం అంకితం – ఆలయ చైర్మన్ సింగం భోజ గౌడ్అమ్మవారి ఆశీస్సులతో ప్రజా సేవకే నా జీవితం అంకితం – ఆలయ చైర్మన్ సింగం భోజ గౌడ్

నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండల కేంద్రానికి చెందిన సింగం భోజ గౌడ్ ఇటీవల ఆడేల్లి అమ్మవారి దేవస్థానం చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆయన సారంగాపూర్‌కు చెందిన రైతు కుటుంబానికి చెందిన గంగాగౌడ్ నర్సవ్వ దంపతుల పెద్ద కుమారుడు. ఐదుగురు కుమార్తెలకు అన్నయ్య అయిన భోజ గౌడ్ గణితంలో
(బి ఎస్సి ) విద్యార్హత కలిగి, రాజకీయాల్లోనూ విశేష సేవలందించిన నేత. 1983లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఆయన, 1992లో మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికై, 2008లో మండల కన్వీనర్‌గా కూడా సేవలందించారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ఆయన చేసిన కృషిని గుర్తించి, తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ సారంగాపూర్ మండలంలోని ఆడేల్లి అమ్మవారి దేవస్థానం చైర్మన్‌గా నియమించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన అధికారులను సన్మానిస్తూ, అమ్మవారి సన్నిధిలో “దేవస్థానంలో అవినీతికి తావు ఇవ్వమని, భక్తుల నమ్మకాన్ని నిలబెట్టాలని” ప్రతిజ్ఞ చేశారు.
“అమ్మవారి పేరుతో అవినీతి చేసే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించను. కఠిన చర్యలు తీసుకుంటాను,” అని ఆయన స్పష్టం చేశారు.భోజ గౌడ్ మాట్లాడుతూ, “పుట్టిన పార్టీ కాంగ్రెస్‌కి కొంతకాలంగా దూరంగా ఉన్నా, అమ్మవారి సేవలో ఉండడం ద్వారా ప్రజలకు సేవ చేయాలనే సంకల్పం మరింత బలపడింది. అమ్మవారి ఆశీస్సులతో ప్రజా సేవకే నా జీవితం అంకితం,” అని తెలిపారు. ఆలయ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన భోజ గౌడ్ ఈ ప్రకటనతో స్థానిక ప్రజలు, భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment