పిల్లల ఉచిత వైద్య సేవలకు ముస్తాబైన ఆసుపత్రి

పిల్లల ఉచిత వైద్య సేవలకు ముస్తాబైన ఆసుపత్రి

పిల్లల ఉచిత వైద్య సేవలకు ముస్తాబైన ఆసుపత్రి

భైంసా, నవంబర్ 13 (మనోరంజని తెలుగు టైమ్స్ ప్రతినిధి):

బాలల దినోత్సవం సందర్భంగా నవంబర్ 14న పిల్లలకు ఉచిత వైద్య సేవలు అందించేందుకు నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని జిడిఆర్ కృష్ణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పూర్తిగా ముస్తాబైంది. పిల్లల మనసులను ఆకట్టుకునేలా ఆసుపత్రి ద్వారాన్ని కార్టూన్ బొమ్మలతో అలంకరించి, రంగురంగుల తోరణాలతో ఆహ్లాదకరంగా తీర్చిదిద్దారు. వైద్య సేవలు అందించబోయే గదులను బెలూన్లతో అలంకరించి సర్వాంగ సుందరంగా మార్చారు. హాస్పిటల్ ప్రొప్రైటర్ డాక్టర్ దీపా జాదవ్ స్వయంగా పర్యవేక్షణ చేస్తూ, పిల్లలకు వైద్య సేవలు అందించే ఏర్పాట్లను సమీక్షించారు. బాలల ఆరోగ్య పరీక్షలు నిరాటంకంగా సాగేందుకు అన్ని విధాలా సదుపాయాలు కల్పించినట్లు తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment