సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మ్యూజిక్ డైరెక్టర్ DSP

Alt Name: DSP and CM Revanth Reddy Meeting

ఎమ్4 న్యూస్ (ప్రతినిధి)

హైదరాబాద్: అక్టోబర్ 16

మ్యూజిక్ మాంత్రికుడు దేవి శ్రీ ప్రసాద్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. టాప్ హీరోలతో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేస్తున్న ఆయన, ఇప్పుడు ఒక కొత్త మైలురాయికి చేరుకోవడానికి సిద్ధమయ్యాడు.

మొట్టమొదటి సారి, దేవి శ్రీ ప్రసాద్ హైదరాబాద్‌లో ఒక లైవ్ కన్సర్ట్ నిర్వహించబోతున్నాడు. ఈ నెల 19న జరిగే ఈ మ్యూజికల్ ఈవెంట్‌కి పలువురు ముఖ్య అతిథులు విచ్చేయనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించినా, దేవిశ్రీ ప్రసాద్ మెగాస్టార్ చిరంజీవి నివాసానికి వెళ్లి ఆయనను ఆహ్వానించాడు.

తాజాగా, ఈ రోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్కలను మర్యాద పూర్వకంగా కలిసారు. 19న గచ్చిబౌలి స్టేడియంలో జరగనున్న మ్యూజికల్ లైవ్ షోకు హాజరు కావాలని కోరారు.

దేవిశ్రీ ప్రసాద్ వెంట ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్ ఉన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి టిక్కెట్లను నిర్వాహకులు ఇప్పటికే విక్రయించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment