ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్

ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభిస్తున్న మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్
  • నిర్మల్ జిల్లా సోఫీనగర్‌లో ఉచిత వైద్య శిబిరం.
  • HAND OF HOPE & RED హైదరాబాద్ సంస్థ ఆధ్వర్యంలో శిబిరం ఏర్పాటు.
  • మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు.
  • పలు రకాల వైద్య పరీక్షలు మరియు ఉచిత మందుల పంపిణీ.

ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభిస్తున్న మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్

నిర్మల్ జిల్లా సోఫీనగర్‌లో HAND OF HOPE & RED సంస్థ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ ప్రారంభించారు. ECG, రక్త పరీక్షలు, కంటి, దంత తదితర సేవలు అందించడంతో పాటు ఉచిత మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభిస్తున్న మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్

నిర్మల్ జిల్లా సోఫీనగర్‌లోని హిందు కమ్యూనిటీ హాల్‌లో HAND OF HOPE & RED హైదరాబాద్ సంస్థ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం శనివారం నిర్వహించారు. ఈ శిబిరానికి ముఖ్య అతిథిగా హాజరైన నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ శిబిరాన్ని ప్రారంభించారు. ప్రజలకు ECG, రక్త పరీక్షలు, ఎక్స్‌రేలు, కంటి, దంత, చర్మ, స్ర్తి సంబంధ వైద్య సేవలు ఉచితంగా అందించడంతో పాటు మందులు పంపిణీ చేశారు.

చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ మాట్లాడుతూ, నిరుపేదల ఆరోగ్య రక్షణకు ఇలాంటి సేవలు ఎంతో అవసరమని, పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమ నిర్వహణకు సహకరించిన డాక్టర్లు సూదక్క దాయనంద్, రాజు, స్థానిక సభ్యులు అబ్దుల్ మతిన్, చిన్నయ్య, నర్సింహారావు, నగేష్, సాయి బాబా, విజయ్ లకు అభినందనలు తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment