* ఖబర్దార్ బడే నాగజ్యోతి, సీతక్క ను విమర్శించే స్థాయి నీకు లేదని హెచ్చరించిన ములుగు జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మద్దాలి నాగమణి …
* గత పదేండ్ల బి.ఆర్.ఎస్.పార్టీ అధికార పాలనలో వరదల వల్ల నష్టపోయిన పంట పొలాలు గుర్తుకురాలేదా…
* గత మీ ప్రభుత్వంలో నష్టపోయిన పంటలకు నష్టపరిహారం ఎంత ఇచ్చారో జవాబివ్వండి…
* గత ప్రభుత్వంలో నువ్వు కూడా అత్యున్నత స్థాయిలోనే ఉన్నావ్ కదా, నువ్వు ములుగు నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి ఏంటి…?
* రా లెక్క తేలుద్దాం… సీతక్క గారు అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాల కాలంలో ఎంత అభివృద్ధి చేశారు…
* నువ్వు గత ఐదేండ్లు అధికార పార్టీలో ఉండి ఎంత అభివృద్ధి చేశావ్ అనేది బహిరంగంగా కూర్చొని చర్చిద్దాం రా…
* జంపన్న వాగు కరకట్ట నీకు ఇప్పుడు గుర్తుకు వచ్చిందా…
* ఇంద్రకీలాద్రి అమ్మవారికి ముక్కు పుడక ఇచ్చిన కేసీఆర్ గారు, భద్రాచలం రాములవారికి పట్టు వస్త్రాలు ఇచ్చిన కేసీఆర్ గారు మేడారం సమ్మక్క – సారలమ్మ జాతరకు రాకుండా గిరిజన సంస్కృతి, సాంప్రదాయాలను అవమానించాడు..
* అప్పుడు నువ్వు ఏం చేశావ్, ఎందుకు ప్రశ్నించలేదు..
* అధికారంలో ఉన్నప్పుడు కరకట్ట ఎత్తు పెంచాలని గుర్తుకు రాలేదా…
* ఇంకోసారి కావాలని సీతక్క గారిని బద్నాం చేయాలని చూస్తే ఊరుకునే ప్రసక్తి లేదని అన్నారు…
* అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు పక్కగా నష్టపరిహారం అందిస్తాం…
తేది: 16.08.2025 శనివారం అనగా ఈరోజున గోవిందరావుపేట మండల కేంద్రంలో మహిళా గ్రామ అధ్యక్షురాలు తోకల అహల్య గారి ఆధ్వర్యంలో మహిళా నాయకుల సమావేశం ఏర్పాటు చేయగా అట్టి సమావేశానికి ముఖ్య అతిథిగా ములుగు జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మద్దాలి నాగమణి గారు విచ్చేసి మేడారం పంట పొలాల గురించి బి.ఆర్.ఎస్.పార్టీ ములుగు నియోజకవర్గ ఇంచార్జి బడే నాగజ్యోతి కాంగ్రెస్ పార్టీ గురించి, మంత్రి సీతక్క గారి గురించి మాట్లాడడం సిగ్గు చేటు అని అన్నారు.
ఈ సందర్భముగా మద్దాలి నాగమణి గారు మాట్లాడుతూ గత పదేండ్లు అధికార పార్టీలో ఉన్నప్పుడు బడే నాగజ్యోతి గారు వరదల వల్ల నష్టపోయిన పంట పొలాలకు ఎంత మేరకు నష్టపరిహారం చెల్లించారో చెప్పాలని, అధికార పార్టీలో ఉండి కూడా ఏ ఒక్కనాడు రైతుల గురించి కానీ రైతుల కష్టాల గురించి కానీ ఆలోచించని నాగజ్యోతి నేడు రైతుల పంట పొలాల నష్టాల గురించి మాట్లాడడం సిగ్గు చేటు అని అన్నారు. 2023 వ సంవత్సరంలో అధిక వర్షాల వలన పెద్ద ఎత్తున ఇండ్లు, పంట పొలాలు కొట్టుకుపోయిన పట్టించుకొని నువ్వు నేడు రైతుల పంట పొలాల నష్ట పరిహారం గురించి మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందని అన్నారు. కనీసం వరదల వలన మనుషుల ప్రాణాలు పోతున్న కూడా వారిని చూడడానికి కూడా రాని నువ్వు ఇవ్వాళా సీతక్క గారి గురించి, కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడడం దారుణం అని అన్నారు. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు వరదల్లో చిక్కుకుని మరణించిన కుటుంబాలకు ఎక్స్ గ్రెసియా కూడా ప్రకటించి ఆదుకొని నువ్వు సీతక్క గారి గురించి మాట్లాడుతున్నావా అని అన్నారు. సీతక్క గారు ములుగు జిల్లా అధికారులతో అనునిత్యం వారితో వర్షాల గురించి, ముంపు ప్రాంతాల గురించి చర్చిస్తూనే ఉంటూ, ముందస్తు జాగ్రత్తలు పాటిస్తూ ఉంటుందని, గత ఏడాది వర్షాల వల్ల ప్రాణ నష్టం జరగొద్దని అధికారులను అప్రమత్తం చేసి, ఎప్పటికప్పుడు ములుగు జిల్లాలోని ముంపు ప్రాంతాల ప్రజలకు అండగా ఉండాలని అధికారులకు సూచిస్తూనే ఉన్నారని, అయిన కూడా ప్రమాదవశాత్తు మరణించిన ఇద్దరికి తక్షణమే వారి కుటుంబాలకు తలో ఐదు లక్షల రూపాయల చెక్కులను అందజేసింది అని గుర్తుకు తెచ్చుకోండి అని అన్నారు. సీతక్క గారు మాటల నాయకురాలు కాదు మీలాగా, హైదరాబాద్ ను సింగపూర్ చేస్తా, వరంగల్ నగరాన్ని ఇస్తాంబుల్ చేస్త అన్నట్లే ఉంటాయి మీ మాటలు అని ఎద్దేవ చేశారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతన్నల కోసం అండగా నిలబడే పార్టీ వరదల వలన నష్టపోయిన పంటపొలాలకు ఖచ్చితంగా నష్ట పరిహారం అందజేస్తాం అని అన్నారు. ఇప్పటికి సీతక్క గారిని విమర్శించడం మానేసి నువ్వు అధికారంలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలని అన్నారు. ఇప్పటికి అయిన సీతక్క గారిని బద్నాం చేస్తే గొప్ప నాయకురాలివి అవుతావనే భ్రమలో బ్రతకడం బందు చేసి, ప్రజా సేవ ఎలా చేయాలో సీతక్క గారిని చూసి నేర్చుకో అని అన్నారు. సీతక్క గారిని ఇంకోసారి విమర్శిస్తే సహించేది లేదని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సూదిరెడ్డి జయమ్మ, గోపిదాసు వజ్రమ్మ, ఎండి. మాజిత, కట్ల ప్రమీల, ల్యాగల అనిత, కొమిరిశెట్టి రమ్య, కుసుమ కృప తదితర మహిళా నాయకులు పాల్గొన్నారు.