పంచాయతీ కార్యదర్శి వైఖరిపై ముదిరాజుల ఆగ్రహం – వివక్షపూరిత వ్యవహారంపై నిరసనలు

పంచాయతీ కార్యదర్శి వైఖరిపై ముదిరాజుల ఆగ్రహం – వివక్షపూరిత వ్యవహారంపై నిరసనలు

పంచాయతీ కార్యదర్శి వైఖరిపై ముదిరాజుల ఆగ్రహం – వివక్షపూరిత వ్యవహారంపై నిరసనలు

పాత పొతంగల్ గ్రామంలో పంచాయతీ కార్యదర్శి చంద్రకాంత్ వ్యవహార శైలిపై ముదిరాజ్ సంఘ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్వీకుల నుంచి వచ్చిన స్థలంలో రేకుల షెడ్ నిర్మాణం చేస్తుండగా, సంబంధిత పైపులను ట్రాక్టర్లతో ధ్వంసం చేయడం దారుణమని మండిపడ్డారు. మహిళలపై సైతం వివక్షతో వ్యవహరించడంపై, చంద్రకాంత్ తీరును నిరసిస్తూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు.

సంఘభవనాలేక ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో రేకుల షెడ్ నిర్మించారు. ఇప్పటికే ఆరు నెలలుగా అది అక్కడ ఉన్నప్పటికీ, ఎటువంటి అభ్యంతరం లేకుండా కొనసాగుతోంది. తాజాగా అదే స్థలంలో మరింత విస్తరణగా పైపులు పాతుతుండగా, చంద్రకాంత్ అర్ధరాత్రి వేళ ట్రాక్టర్‌తో వచ్చి వాటిని ధ్వంసం చేయడం దారుణమని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

ఈ ఘటనపై స్పందించిన ముదిరాజ్ మహిళలు – “మా మీద మహిళలమని చూడకుండా చంద్రకాంత్ దౌర్జన్యంగా వ్యవహరించాడు. ఇది సహించదగినది కాదు,” అని పేర్కొన్నారు. గ్రామస్థులు మాట్లాడుతూ, “గ్రామంలో ఇతర ప్రభుత్వ స్థలాలున్నప్పటికీ, ముదిరాజుల స్థలంపైనే ఆరోగ్య సబ్ సెంటర్ నిర్మాణం పేరిట దాడులు జరగడం బాధాకరం,” అని అన్నారు.

గ్రామస్తుల డిమాండ్లు:

  • బాధిత ముదిరాజ్ కుటుంబాలకు న్యాయం చేయాలి

  • కార్యదర్శి చంద్రకాంత్ ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి

  • షెడ్ నిర్మాణాన్ని అడ్డుకోవద్దు

  • పంచాయతీ కార్యదర్శి నిష్పక్షపాతంగా పనిచేయాలి

కార్యదర్శి స్పందన:
ఈ ఘటనపై స్పందించిన చంద్రకాంత్, “ఆ స్థలం ప్రభుత్వానికి చెందింది. ఆరోగ్య సబ్ సెంటర్ కోసం సర్వే జరుగుతోంది. నాకు ఎలాంటి ఫిర్యాదులు ఇవ్వలేదు. ఎవరి ఒత్తిళ్లకూ తలొగ్గలేదు,” అని స్పష్టం చేశారు.

గ్రామంలో ఉద్రిక్తత నెలకొన్న నేపథ్యంలో అధికారులు ముదిరాజ్ సంఘంతో చర్చలు జరిపి సమస్యకు పరిష్కారం చూపాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment