శిథిలావస్థలో ముధోల్ తహసీల్దార్ కార్యాలయం…!

శిథిలావస్థలో ముధోల్ తహసీల్దార్ కార్యాలయం…!

నిజాం కాలంలో నిర్మాణం-పెచ్చులూడుతున్న వైనం

భయం.. భయంతో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది

వర్ష కాలంలో పై భాగం నుండి ఊర్పులు

*ముధోల్ మనోరంజని ప్రతినిధి జూలై 31*

శిథిలావస్థలో ముధోల్ తహసీల్దార్ కార్యాలయం...!

ముధోల్ నియోజవర్గ కేంద్రములోని తహసీల్దార్ కార్యాలయంలోని మూడు గదులలోనే కొన్ని సంవత్సరంల నుండి ముధోల్ ఉపకోశాధి కార్యాలయం కొనసాగుతున్నది. మిగతా గదులలో తహశీల్దార్ కార్యాలయం కొనసాగుటున్నది. ఐతే ఈ భవనం శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా మారింది. పైకప్పు పెచ్చులు ఊడిపోతుండడంతో ఇనుప ఊచలు బయటకు తేలి భయపెడుతున్నాయి. గోడలు, స్తంభాలకు పగుళ్లు ఏర్పడి ఎక్కడికక్కడ ఊడుతున్నాయి. కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బందితో పాటు పనుల నిమిత్తం వచ్చే స్థానికులు సైతం ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని భయాందోళనకు గురవుతున్నారు. కార్యాలయం భవన జీవిత కాలం ముగిసినా ఇంకా అందులోనే కొనసాగించడాన్ని పలువురు విమర్శిస్తున్నారు.  నిజాం కాలంలో సుమారు 1920 సంవత్సరంలో ఈ కార్యాలయ భవనం నిర్మించారని ముధోల్లోని వయో వృద్ధులు పేర్కొంటున్నారు. ఈ భవనం నిర్మించి వంద ఏళ్లు కావస్తుందని  ఇదే భవనంలో తహశీల్దార్ కార్యాలయం తో పాటు ఉపకోశాధికారి కార్యాలయం కొనసాగుతున్నవి తహసీల్దార్ కార్యాలయం శిథిలావస్థకు చేరింది. భవనం స్లాబ్ పెచ్చులు ఊడటమే కాకుండా, వానోస్తే ఊరుస్తోంది. దీంతో కార్యాలయ ఉద్యోగులు బిక్కు బిక్కుమంటూ విధులకు హాజరవుతున్నారు. వర్షాకాలం వచ్చిందంటే చాలు కార్యాలయం మొత్తం తడచి ముద్దవుతుంది. సుమారు వంద ఏళ్ల పాత భవనం కావడంతో శిథిలావస్థకు చేరింది. ఉద్యోగులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తహసీల్దార్ గది తో పాటు అన్ని గదులు దెబ్బతిన్నాయి. వర్షం కాలంలో అన్ని గదుల పై కప్పు నుండి వర్షం నీరు జలిస్తుందని. ఏ సమయంలో ఎక్కడి నుండి పై కప్పు పెచ్చులు  ఊడుతాయోనని భయపడుతున్నారు. మరమ్మత్తు లు చేపట్టిన భవనం నిలువదని ఈ కార్యాలయం భవనం కాలం చెల్లిందని గ్రామస్తులు, అధికారులు సైతం పేర్కొంటున్నారు. ముధోల్-బాసర-తానూర్ మండలాల నుండి ఈ ట్రెజరీ కార్యాలయంకు అధికారులు, నాయకులు వస్తుంటారు. అంతే కాకుండా నియోజవర్గ కేంద్రం కావడంతో పని నిమిత్తం కార్యాలయంకు అను నిత్యం ప్రజలు వస్తుంటారు. విశాలమైన  స్థలం ఉన్నది. కానీ ప్రభుత్వం ఎందుకు నూతన భవన నిర్మాణం కొరకు నిధులు మంజూరు చేయడం లేదన్న ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. పేరుకే నియోజకవర్గ కేంద్రము అన్ని సమస్యలే అని ప్రధాన కార్యాలయం నూతన భవన నిర్మాణం కు నోచుకోవడం లేదని పలువురు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు స్పందించి నియోజకవర్గ కేంద్రమైన ముధోల్ తహసీల్దార్ కార్యాలయం .ట్రెజరీ కార్యాలయంకు నూతన భవన ఏర్పాటుకు  త్వరితగతిన చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment