ఆరోగ్య ఉపకేంద్ర భవన నిర్మాణానికి శంకుస్థాపన. ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్

ఆరోగ్య ఉపకేంద్ర భవన నిర్మాణానికి శంకుస్థాపన.

ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్

*బాసర మనోరంజని ప్రతినిధి జూలై 31*

బాసర మండల కేంద్రంలో రూ.16 లక్షలతో నిర్మిస్తున్న ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్ర భవన నిర్మాణానికి ఎమ్మెల్యే రామారావు పటేల్ భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామంలోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించడానికి ఉప కేంద్రాలను నిర్మిస్తామన్నారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా వైద్య రంగాన్ని బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుంటానని ఈ క్రమంలో స్థానిక ప్రజలకు మరింత వేగవంతమైన మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణాన్ని చేపట్టిందని తెలిపారు. అధికారులు నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment