పెగడపల్లి గ్రామపంచాయతీని సందర్శించిన ఎం పి ఓ.
మనోరంజని, మంచిర్యాల జిల్లా ప్రతినిధి.
జైపూర్ మండల పంచాయితీ అధికారి శ్రీపతి బాపు రావు మండలంలోని, పెగడపల్లి గ్రామ పంచాయతీ ని సందర్శించడం జరిగింది. గ్రామంలో నిర్వహిస్తున్న పారిశుధ్య కార్యక్రమాలను పరిశీలించి తడి చెత్త పొడి చెత్త వేరువేరుగా సేకరించాలని, గ్రామంలో ప్లాస్టిక్ కవర్లు ఇతర వ్యర్థాలు లేకుండా చూసుకోవాలని పంచాయితీ కార్యదర్శి కి సూచించడం జరిగింది. నర్సరీ మొక్కలు హోమ్ స్టెడ్ ప్లాంటేషన్ క్రింద గృహాలకు పంపిణీ చేయాలని సూచించారు. పల్లె ప్రకృతి వనం మొక్కలను సంరక్షించాలని, వనమహోత్సవం కార్యక్రమంను నిర్వహించాలని పంచాయతీ కార్యదర్శికి సూచించడం జరిగింది. త్రాగు నీటి వాటర్ ట్యాంకు లను పరిశీలించి క్లోరినేషన్ చేయించి శుభ్రమైన నీటిని మాత్రమే సరఫరా చేయాలని సూచించారు. సీజనల్ వ్యాధులు పైన అవగాహనా కల్పించడం జరిగింది అనంతరం, గ్రామ పంచాయతీ రికార్డులు తనిఖీ చేశారు గ్రామపంచాయతీకి సంబందించిన అన్ని రికార్డులు అప్డేట్ చెయ్యాలని ఆదేశించడం జరిగింది . ఫై కార్డు ప్రచురించడం జరిగింది. పంచాయతి కార్యదర్శి డి. పావని మరియు గ్రామ పంచాయతీల సిబ్బంది పాల్గొన్నారు