మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలి… ఎంపీడీవో లక్ష్మీ కాంతారావు

మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలి…
ఎంపీడీవో లక్ష్మీ కాంతారావు

మనోరంజని ( ప్రతినిధి )

సారంగపూర్ : డిసెంబర్ 14

,నిర్మల్ జిల్లా సారంగాపూర్,మెనూ ప్రకారం విద్యార్థులకు రుచికరమైన భోజనాన్ని అందించాలని సారంగాపూర్ ఎంపీడీవో లక్ష్మీ కాంతారావు అన్నారు. శనివారం మండల కేంద్రంలోని స్వర్ణ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో, ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజన సమయంలో పాఠశాలకు చేరి విద్యార్థుల కు వండిన వంటలను పరిశీలించారు. ప్రతిరోజు విద్యార్థులకు అందిస్తున్న మెనూ వివరాలను పాఠశాల నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. మెనూ ప్రకారం భోజనం అందించాలని లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం తరగతి గదులను పరిశీలించి విద్యార్థుల సంఖ్యను తెలుసుకున్నారు. పదవ తరగతి పరీక్షలు సమీపిస్తున్నందున విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి ఉపాధ్యాయులు పాఠశాల ఉత్తీర్ణత శాతాన్ని పెంచాలని సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్దుల్ హాది, ఎస్సై శ్రీకాంత్, పాఠశాల ప్రిన్సిపాల్ సంగీత, వాడెన్ రాథోడ్ మంగీలాల్,పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు,తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment