తడి చెత్త పొడి చెత్త లను వేరువేరుగా సేకరించాలి. ఎంపీ ఓ శ్రీపతి బాపూరావు.

తడి చెత్త పొడి చెత్త లను వేరువేరుగా సేకరించాలి. ఎంపీ ఓ శ్రీపతి బాపూరావు.

తడి చెత్త పొడి చెత్త లను వేరువేరుగా సేకరించాలి.

ఎంపీ ఓ శ్రీపతి బాపూరావు.

మంచిర్యాల, మనోరంజని ప్రతినిధి.

జైపూర్ మండల పంచాయతీ అధికారి శ్రీపతి బాపు రావు మిట్టపల్లి గ్రామపంచాయతీని సందర్శించారు. ఈజీఎస్ గ్రామ సభలో పాల్గొని అనంతరం మొబైల్ యాప్ ఇన్స్పెక్షన్ లో భాగంగా గ్రామంలో నిర్వహిస్తున్న పారిశుధ్య కార్యక్రమాలను పరిశీలించి తడి చెత్త పొడి చెత్త వేరువేరుగా సేకరించాలని, గ్రామంలో ప్లాస్టిక్ కవర్లు ఇతర వ్యర్థాలు లేకుండా చూసుకోవాలని, గ్రామ పంచాయతీ కార్యదర్శి కి సూచించడం జరిగింది. రహదారులు మరియు మురుగు కాల్వలు పరిశుభ్రంగా ఉంచాలని సూచించడం జరిగింది. గ్రామ పంచాయతీ రికార్డులను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని తెలియ చేసినారు. సెగ్రిగేషన్ షెడ్ నందు కంపోస్టు ఎరువు తయారు చేయాలని పంచాయతీ కార్యదర్శికి సూచించడం జరిగింది. వాటర్ అండ్ శానిటేషన్ కు సంభందించిన 7 రిజిష్టర్లను పరిశీలించారు. అనంతరం, వాటర్ ట్యాంకు చుట్టూ శుభ్రం చేయాలని సూచించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment