🔹 మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధిలో వరుసగా విద్యార్థుల ఆత్మహత్యలు
🔹 షాద్‌నగర్‌లో స్కూల్‌పై నుంచి దూకిన నీరజ్, బాలానగర్ గురుకులంలో ఉరిసుకున్న 10వ తరగతి విద్యార్థిని ఆరాధ్య
🔹 ఈ ఘటనలపై ఎంపీ డీకే. అరుణ ఆందోళన, అధికారుల నుంచి వివరణ కోరిన ఎంపీ
🔹 విద్యార్థుల ఆత్మహత్యల వెనుక అసలు కారణాలు బయటకు రావాలని డిమాండ్
🔹 కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత వల్లే హాస్టళ్లలో మరణ ఘోష
🔹 బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీకే. అరుణ డిమాండ్
మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధిలో వరుసగా విద్యార్థుల ఆత్మహత్యలు సంచలనం రేపుతున్నాయి. షాద్‌నగర్‌లో నీరజ్, బాలానగర్ గురుకులంలో 10వ తరగతి విద్యార్థిని ఆరాధ్య సూసైడ్ చేసుకున్నారు. ఈ ఘటనలపై ఎంపీ డీకే. అరుణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, విద్యార్థుల మరణాలకు అసలు కారణాలు వెలుగులోకి రావాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధిలో విద్యార్థుల ఆత్మహత్యల వరుస ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. నిన్న షాద్‌నగర్‌లో నీరజ్ అనే విద్యార్థి స్కూల్‌పై నుంచి దూకి ప్రాణాలు కోల్పోగా, ఇవాళ బాలానగర్‌లోని గురుకుల పాఠశాలలో 10వ తరగతి విద్యార్థిని ఆరాధ్య ఉరిసుకొని మరణించడంతో సంచలనం ఏర్పడింది.
ఈ ఘటనలపై మహబూబ్‌నగర్ ఎంపీ డీకే. అరుణ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విద్యార్థుల ప్రాణాలు పోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, హాస్టళ్లలో జరుగుతున్న దుర్వ్యవస్థలు వెలుగులోకి రావాలని డిమాండ్ చేశారు. జిల్లా ఎస్పీ జానకితో ఫోన్లో మాట్లాడి పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు.
“అసలు ప్రభుత్వ వసతి గృహాల్లో ఏం జరుగుతోంది? సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్ల విద్యార్థులు ప్రాణాలు తీసుకుంటున్నారా?” అని ఆమె ప్రశ్నించారు. విద్యార్థుల మరణాలకు ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని, సమగ్ర విచారణ జరిపించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీకే. అరుణ డిమాండ్ చేశారు.