చెడు అలవాట్లకు దూరంగా ఉండి ముందడుగు వేయాలి
మోటివేషన్ స్పీకర్ వాడేకర్ లక్ష్మణ్
తానూరు మనోరంజని ప్రతినిధి సెప్టెంబర్ 12
ప్రభుత్వ జూనియర్ కాలేజీ, హైస్కూల్, తానూరులో మదక ద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమం ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రెయినర్-ఆనందితా ఫౌండేషన్ చైర్మన్ వడేకర్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో జరిగింది. విద్యార్థుల్లో మదక ద్రవ్యాల గురించి అవగాహన కల్పించడం, వాటి దుష్ప్రభావాలను తెలియజేయడం ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం. వడేకర్ లక్ష్మణ్ మాట్లాడుతూ మదక ద్రవ్యాలు యువత జీవితాలను నాశనం చేస్తాయి. వీటి నుండి దూరంగా ఉండి, మంచి లక్ష్యాలను పెట్టుకొని చదువులో రాణించాలి,” అని విద్యార్థులకు సలహా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ రాజశేఖర్, హెడ్ మాస్టర్ సాయిబాబా, ఉపాధ్యాయులు విజయ్, రాజేందర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మదక ద్రవ్యాల వల్ల కలిగే శారీరక, మానసిక సమస్యల గురించి విద్యార్థులకు వివరించబడింది. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండి, మంచి జీవనశైలిని అవలంబించాలని నిర్ణయించుకున్నారు. స్కూల్ యాజమాన్యం- ఉపాధ్యాయులు కార్యక్రమ నిర్వహణకు పూర్తి సహకారం అందించారు