బిడ్డలను చంపిన కేసులో తల్లి, ఆమె ప్రియుడికి జీవిత ఖైదు
బిడ్డలను చంపిన కేసులో తల్లి, ఆమె ప్రియుడికి జీవిత ఖైదు
తన సుఖం కోసం కన్నబిడ్డల్ని కడతేర్చిన కసాయి తల్లి, ఆమె ప్రియుడికి జీవిత ఖైదు విధిస్తూ కాంచీపురం కోర్టు గురువారం తీర్పునిచ్చింది. 2018లో వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నారన్న నెపంతో పాలలో మత్తుమాత్రలు కలిపి 7 ఏళ్ల అజయ్, 4 ఏళ్ల కర్ణికను హతమార్చిన కేసులో తల్లి అభిరామి, ఆమె ప్రియుడు మీనాక్షి సుందరాన్ని చెన్నై పోలీసులు అరెస్టు చేశారు. నేరం రుజువు కావడంతో అభిరామి, సుందరానికి మరణించే వరకు జీవిత ఖైదు విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు