మనెమోని సలేశ్వరం భౌతిక కాయానికి బీజేపీ నాయకుల నివాళి
మనోరంజని తెలుగు టైమ్స్, నాగర్‌కర్నూల్, అక్టోబర్ 13
పెద్దకొత్తపల్లి మండలం మరికల్ గ్రామానికి చెందిన మనెమోని సలేశ్వరం మరణంతో బీజేపీ నాయకులు ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించారు.
నాగర్‌కర్నూల్ జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షులు, కొల్లాపూర్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ ఎల్లేని సుధాకర్ రావు గారి ఆదేశాల మేరకు జిల్లా బీజేపీ కార్యదర్శి తిరుమల్ యాదవ్, మాజీ ఉప సర్పంచ్ బొల్లె జగన్ మనెమోని సలేశ్వరం పార్థివ దేహాన్ని సందర్శించి పుష్పాంజలి ఘటించారు.
అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యంగా ఉండాలని వారికి సలహా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ సభ్యుడు మేకల శివ, మండల ప్రధాన కార్యదర్శి పిల్లి నాగరాజు, గ్రామ బూత్ అధ్యక్షుడు మనెమోని చంద్రశేఖర్, సీనియర్ నాయకులు పుట్ట రాములు, కావలి శివుడు, కుసునూరి సురేష్ తదితరులు పాల్గొన్నారు.