అబ్దుల్లాపూర్లో ప్రతిష్టించిన మోక్ష కర్ర గణపతి

అబ్దుల్లాపూర్లో ప్రతిష్టించిన మోక్ష కర్ర గణపతి

అబ్దుల్లాపూర్లో ప్రతిష్టించిన మోక్ష కర్ర గణపతి

30 సంవత్సరాలుగా గ్రామంలో ఒకే వినాయకుడు

ప్రతిరోజు అన్నదానం

లోకేశ్వరం మనోరంజని ప్రతినిధి ఆగస్టు 28

లోకేశ్వరం మండలంలోని అబ్దుల్లాపూర్ గ్రామంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే బుధవారం మోక్ష కర్ర గణపతిని గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ప్రతిష్టింపజేశారు ఈ మోక్ష వినాయకుని గత మూడు సంవత్సరాల క్రితం తిరుపతి సమీపంలోని మారుమూల గ్రామంలో ఒకే కర్రతో భక్తిశ్రద్ధలతో తయారు చేయించారు ఈ గ్రామంలో గత 30 సంవత్సరాల నుండి గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఒకే వినాయకుని ప్రతిష్టించి గ్రామస్తులందరూ పూజలు నిర్వహిస్తారు గత మూడు సంవత్సరాల నుండి మోక్ష కర్ర వినాయకుని ప్రతిష్టించి ప్రత్యేక పూజలు అందిస్తున్నారు. ఈ 11 రోజుల సందర్భంగా ప్రతిరోజు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. గ్రామస్తులంతా ఏకతాటిపై ఉంటూ ప్రతి సంవత్సరం ఆ ఒక్క గణపతిని లక్షలు వెచ్చించి వృధా ఖర్చు చేసే బదులు ఒకేసారి కర్ర వినాయకుని తయారు చేయించి ప్రతిష్టించడంతో ప్రతి సంవత్సరం వృధా ఖర్చు తగ్గుతుందని ఆలోచించి ఈ కర్ర గణపతిని తయారు చేయించినట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామంలోని ప్రతి ఇంటి నుండి ప్రతి ఒక్కరూ దైవ సన్నిధిలో భక్తి భావంతో ఉంటూ అక్కడకు వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకుంటారు. ఈ గ్రామస్తుల ఐక్యతను పలువురు అభినందిస్తున్నారు. అబ్దుల్లాపూర్ గ్రామం ముధోల్ నుండి 13 కిలోమీటర్లు నిర్మల్ నుండి వయా లోకేశ్వరం మీదుగా రావచ్చు అదేవిధంగా నందిపేట్ నుండి పంచగూడెం మీదుగా కూడా రావచ్చు. ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అబ్దుల్లాపూర్ గ్రామానికి బైంసా డిపో నుండి ప్రత్యేక బస్సులను కూడా నడిపిస్తున్నట్లు తెలిపారు

Join WhatsApp

Join Now

Leave a Comment