శ్రీ అక్షర పాఠశాలలో నమూనా ఎన్నికలు
ఎమ్4 ప్రతినిధి ముధోల్
మండల కేంద్రమైన ముధోల్ లోని శ్రీ అక్షర పాఠశాలలో విద్యార్థులకు ఎన్నికల విధానంపై ప్రత్యక్షంగా అవగాహన కల్పించేందుకు శుక్రవారం నమూనా ఎలక్షన్ ( మాక్ పోలింగ్ను) నిర్వహించినట్లు పాఠశాల డైరెక్టర్ సుభాష్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలల్లోని ఐదు నుంచి ఏడవ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ ఎన్నికల్లో పోటీదారులుగా, ఓటర్లుగా, ఎన్నికల సిబ్బందిగా, పోలీసులుగా విధులు నిర్వహించి ఆలరించారని పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణ, పోలింగ్ ఈవీఎంపై, ఓటింగ్ విధానం, కౌంటింగ్, బ్యాలెట్ బాక్స్ లపై విద్యార్థులకు అవగాహన కల్పించడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు. మొత్తం ప్రక్రియ నిజమైన ఎన్నికలలాగే నిర్వహించడం జరిగిందని, ఈ పోటీలో 14 మంది నామినేషన్ వేయగా ఆరుగురి నామినేషన్లను తిరస్కరించగా ముగ్గురు విత్ డ్రా చేసుకున్నారు. ఐదుగురు విద్యార్థులకు గుర్తులు కేటాయించి పోలింగ్ నిర్వహించగా ఏడవ తరగతికి చెందిన సాయి తేజ 97 ఓట్లను సాధించి విజయం సాధించాడు. అలాగే ఏడవ తరగతికి చెందిన మనిషా అనే విద్యార్థిని 87 ఓట్లు సాధించి రెండవ స్థానంలో నిలిచింది. మొత్తానికి ఎలక్షన్ హోరాహోరీగా సాగడంతో విద్యార్థులు పాఠశాల ఆవరణాన్ని నిజమైన పోలింగ్ కేంద్రంలా తలపించారు. పాఠశాల ఆవరణలో విద్యార్థులు ప్రచార కార్యక్రమంలో విద్యార్థులే పోలీసులు గా మారి విధి నిర్వహణలో పాల్గొనడం, పోలింగ్ బూత్ లో పోలీస్ ఆఫీసర్లుగా విద్యార్థులు పాల్గొనడంతో పాఠశాలలోని ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ సాయికుమార్, అకాడమిక్ ఇంచార్జ్ స్వప్నగంధ శర్మ, ఇంచార్జ్ మధు షిండే, ఉపాధ్యాయులు మహేందర్ సంతోష్, ప్రశాంత్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.