ప్రభుత్వ జూనియర్ కళాశాల భవన శంకుస్థాపనలో ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం

ప్రభుత్వ జూనియర్ కళాశాల భవన శంకుస్థాపనలో ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం

ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో శంకుస్థాపన

చదువుతూనే సామాజిక గౌరవం

విద్య అంగడి సరుకు కావద్దు

హాజరైన మాజీ ఎమ్మెల్యేలు బక్కని నర్సింలు, భీశ్వ కిష్టయ్య, ప్రతాప్ రెడ్డి..

పోరాట వీరుడు తుర్రెబాజ్ ఖాన్ పోరాటపటివను గుర్తుచేసిన ఎమ్మెల్సీ

తెలుగుదేశం, సిపిఎం, బిజెపి, కాంగ్రెస్ పార్టీ నేతల హాజరు

M4 న్యూస్ రంగారెడ్డి జిల్లా ప్రతినిథి అక్టోబర్ 21:

ప్రభుత్వ జూనియర్ కళాశాల భవన శంకుస్థాపన కార్యక్రమం

సమాజంలో మార్పుకు విద్య తోడ్పాటు అందిస్తుందని, సామాజిక గౌరవం లభిస్తుందని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణ కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన అత్యాధునిక భవనానికి దాతల సహకారంతో సుమారు రూ. 10 కోట్ల అంచనాలతో స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ నేతృత్వంలో శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రొఫెసర్ కోదండరాం అదేవిధంగా స్థానిక మాజీ ఎమ్మెల్యేలు బక్కని నర్సింహులు, భీశ్వ కిష్టయ్య, చౌలపల్లి ప్రతాప్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ కే నరేందర్, కమిషనర్ చీమ వెంకన్న, మాజీ జెడ్పిటిసిలు వెంకటరామిరెడ్డి, తాండ్ర విశాల శ్రావణ్ రెడ్డి, పట్టణ పుర ప్రముఖులు నాగిళ్ల గోపాల్ గుప్తా, యాదవ చారి, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందే బాబయ్య, న్యాయవాది చెంది మహేందర్ రెడ్డి, హిందు వాహిని నాయకులు చెట్ల వెంకటేష్, టిఆర్ఎస్ నేతలు యుగంధర్, చెట్ల నర్సింలు, శేఖర్ వ్యాపారస్తులు పొలబట్ల పాండురంగయ్య, దండు వాసు, నాగలింగం, పట్టణ అధ్యక్షుడు చెన్నయ్య, కాంగ్రెస్ నేతలు మహ్మద్ అలీ ఖాన్ బాబర్, చెంది తిరుపతి రెడ్డి, ,పెంటయ్య ,రఘు, శ్రీకాంత్ రెడ్డి, బాలరాజు గౌడ్, ధంగు శ్రీనివాస్ యాదవ్, కౌన్సిలర్లు కృష్ణవేణి, లత శ్రీశైలం గౌడ్, శ్రావణి జమృత్ ఖాన్, సరిత యాదగిరి, వర్ష ఐటిఐ రాజు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఎమ్మెల్సీ కోదండరాం ప్రసంగిస్తూ.. చదువుతూనే సమాజంలో గౌరవం లభిస్తుందని అన్నారు. చదవకపోతే అరేయ్ రాములు.. ఒరే రాములు అంటూ సంభోదిస్తారని చదువుకున్నవాడిని సార్ అంటూ సమాజం గౌరవిస్తుందని ఉదహరించారు. చదువుకున్న గొప్పతనం అదేనని అందుకే విద్యకు ఎవరైనా సరే ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. దురదృష్టవశాత్తు సమాజంలో నేడు విద్య అంగడి సరుకు అయిందని అలా జరుగోద్దని అన్నారు. విద్యకు పెద్దపీట వేసిన నాడే సమాజంలో మార్పు లభిస్తుందని అన్నారు. అన్నింటికీ విద్య ముఖ్యమని అన్నారు. విద్యార్థి దశలో ఇంటర్మీడియట్ జంక్షన్ బాక్స్ లాంటిదని అన్నారు. షాద్ నగర్ పట్టణంలో దాతల సహకారంతో దాదాపు పదికోట్ల రూపాయల అంచనాలతో ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనం నిర్మించడం పట్ల ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇంత గొప్ప మనసున్న దాతలకు ఈ కార్యక్రమం కోసం ముందుకు వచ్చిన స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ను ప్రొఫెసర్ కోదండరాం అభినందించారు.
షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తలపెట్టిన ఈ కార్యక్రమం ఓ బృహత్తర యజ్ఞం లాంటిదని కొనియాడారు. దీనికి ధనవంతు సహకారం అందిస్తానని అన్నారు. సమాజంలో రాజకీయంపరంగా ఇది ఒక కొత్త వరవడి అని అన్నారు. ఎంతసేపు నా ఇల్లు నా పిల్లలు అంటూ వ్యక్తిగతంగా ఆలోచించే ఈ రోజుల్లో సమాజం కోసం పరితపించే ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఇలాంటి వారు చాలా అరుదని కొనియాడారు.బ్రిటీషర్ల తొత్తులైన రాజులు, నవాబులు, సంస్దానాధీశులపై తిరుగుబాటు చేసిన యోధుడు, ప్రముఖ విప్లవకారుడు తుర్రేబాజ్ ఖాన్ పోరాట పటిమ గావించిన షాద్ నగర్ నియోజకవర్గంలో
మరోమారు మనకి తెలంగాణ విముక్తి కోసం పోరాడిన పట్టుదల ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ లో కనిపించిందని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం ప్రస్తావించడం విశేషం. కళాశాల భవన శంకుస్థాపన కార్యక్రమం సందర్భంగా ఎమ్మెల్సీ కోదండరాం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ప్రభుత్వ జూనియర్ కళాశాల భవన శంకుస్థాపన కార్యక్రమం
ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామ జ్వాలలు ఉత్తర భారతదేశంలో రగిలినప్పటికీ, అవి అక్కడికే పరిమితం కాలేదు. బానిస బంధనాల నుండి మాతృభూమిని విముక్తం చేయాలని ప్రజానీకంలో పెల్లుబికిన బలమైన కాంక్షకు జాతి, మతం, కులం, భాషలు, ఆచార సంప్రదాయాలు, ప్రాంతాలు అడ్డుగోడలు కాలేకపోయాయి. ఆయా ప్రాంతాలలోని బ్రిటీషర్ల తొత్తులైన రాజులు, నవాబులు, సంస్దానాధీశులు కూడా తిరుగుబాటును నిలువరించలేక పోయారు. ఉప్పెనలా ఉవ్వెత్తున ఎగిసిన తిరుగుబాటును ఆపడం ఆనాడు ఎవరి తరం కాలేదు. చివరకు ఉరి కొయ్యలు, చెరసాలలు కూడా స్వేచ్ఛాపిపాసువులను ఆపలేక పోయాయి. ఆధునిక ఆయుధాలు కలిగి, అపారమైన సైనిక బలగాలున్న బ్రిటీష్‌ పాలకులను ఎదుర్కోవడం ఆత్మహత్యాసదృశ్యం కాగలదని స్పష్టంగా తెలుసు. పోరుబాటలో మరణం తధ్యమన్న చేదు నిజం తెలిసి కూడా పరాయిపాలకులను తరిమి కొట్టేందుకు తుర్రె బాజ్ ఖాన్ నడుం కట్టారు. ఆయుధం చేతపట్టి కదన రంగాన అరివీర భయంకరులై పోరాడి అమరులయ్యారు. ఆ కోవకు చెందిన యోధులలో పఠాన్‌ తుర్రేబాజ్‌ ఖాన్‌ ఒకరని అలాంటి గడ్డపై విద్య పరంగా ఎమ్మెల్యే “వీర్లపల్లి శంకర్” లాంటివారు భవిష్యత్తు తరాలకు విద్యను ఇలాంటి స్వార్థం లేకుండా అందించడం గొప్ప విషయం అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు బక్కని నర్సింహులు, చౌలపల్లి ప్రతాప్ రెడ్డి, బిశ్వ కిష్టయ్య, మాజీ జడ్పీటీసీలు మామిడి శ్యామసుందర్ రెడ్డి, వెంకట్ రాంరెడ్డి, తాండ్ర విశాల శ్రావణ్ రెడ్డి, కందివనం సూర్యప్రకాష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తాండ్ర కాశినాథ్ రెడ్డి,ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సర్వేశ్వర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ చీమ వెంకన్న, కౌన్సిలర్స్ అగ్గనూరు విశాల విశ్వం, పులిమామిడి లతాశ్రీ శ్రీశైలం గౌడ్, సరిత యాదగిరి యాదవ్, కృష్ణ వేణి, శ్రావణి, రాయికల్ శ్రీనివాస్,సర్వర్ పాషా, పట్టణ పుర
ప్రముఖులు నాగిళ్ళ గోపాల్ గుప్తా, యాదవ చారి,
కాంగ్రెస్ పార్టీ నేతలు చెంది తిరుపతి రెడ్డి, బాబర్ ఖాన్, రఘు నాయక్, అగ్గనూరు విశ్వం,బాలరాజు గౌడ్,చల్ల శ్రీకాంత్ రెడ్డి, గూడా వీరేష్, హరినాథ్ రెడ్డి, ఆగిర్యాల కృష్ణ రెడ్డి, జగదీష్ ముదిరాజ్, అప్ప,చెన్నయ్య, జమృత్ ఖాన్,అగ్గనూరు బస్వం, విజయ్ కుమార్ రెడ్డి,దంగు శ్రీనివాస్,గంగన్న గూడా దామోదర్ రెడ్డి,కట్ట వెంకటేష్ గౌడ్, ఆగిర్ రవి కుమార్ గుప్తా, పురుషోత్తం రెడ్డి, జితేందర్ రెడ్డి,రఘమ రెడ్డి, ఖాదర్ గోరి, కేకే కృష్ణ, జాంగారి రవి, అక్రమ్,తోకల దామోదర్ రెడ్డి,నర్సింహా రెడ్డి,నవజ్ గోరి, ఖాదీర్,దిలీప్ కుమార్, లింగారెడ్డి గూడా అశోక్, అక్కిగారి శ్రీధర్,సీతారాం,జాంగారి జంగయ్య, డాకం మనీష్, అనిమి గణేష్ గౌడ్,సింగపగ అనిల్,సింగారం దర్శన్,
బి ఆర్ ఎస్ నేతలు యుగేందర్, చెట్ల నర్సింహులు, పిల్లి శేఖర్,
బీజేపీ నేతలు అందే బాబయ్య, చెంది మహేందర్ రెడ్డి, వంశీకృష్ణ,
తెలుగుదేశం పార్టీ నేతలు చల్లా వెంకటేశ్వర్ రెడ్డి, లింగారం కుమార్ గౌడ్, అనంతయ్య, రిటైడ్ తహసీల్దార్ సరపు జగదీశ్వర్, నేతలు సిపిఎం రాజు, తెలంగాణ విద్యావంతుల వేదిక టిజీ శ్రీనివాస్, శ్రీనివాస్ రాజు, అర్జునప్ప,
సురేష్ కుమర్, క్రాంతి కుమార్, దండు వాసు, జగదీష్ శర్మ, మోముల వినోద్ కుమార్,విశ్వనాధ్,యువసత్తా లక్ష్మన్, గంగిరెడ్డి నందిగామ సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment