వికారాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో దీక్షా దివస్ సన్నాహక సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ రెడ్డి
M4 న్యూస్, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి – నవంబర్ 26:
నవంబర్ 29వ తేదీన రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ పిలుపుమేరకు అన్ని జిల్లా కేంద్రాలలో దీక్షా దివస్ కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా వికారాబాద్ జిల్లాకు ఇన్చార్జిగా నియమితులైన పాలమూరు ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి, వికారాబాద్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులు మరియు కార్యకర్తలతో సన్నాహక సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో, ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి, ఈ కార్యక్రమం విజయవంతం కావాలనుకుంటే, దీక్షా దివస్ కేవలం జిల్లా కేంద్రాలలో మాత్రమే జరగాలని, పార్టీకి సంబంధించిన అన్ని నాయకులను, కార్యకర్తలను ప్రత్యేకంగా ఆహ్వానించాలని, తదనుగుణంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు.
ఇవన్నీ మరియూ అందరం సంఘటితమై, ఏకమై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి తో పాటు వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, పరిగి మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి, వికారాబాద్, కొడంగల్, తాండూర్, పరిగి నియోజకవర్గాల మాజీ జడ్పి టిసిలు, మాజీ ఎంపిపిలు, మాజీ ఎంపిటిసిలు, వికారాబాద్ జిల్లాలోని మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.