నారాయణ పేట: చిరుత దాడిలో గాయపడిన బాధితులకు ఎమ్మెల్యే పరామర్శ
కోయిలకొండ మండలం కోతలబాద్ గ్రామస్థులు చిరుత దాడిలో గాయపడి మహబూబ్ నగర్ లో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను సోమవారం నారాయణ పేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్య బృందాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు