బోసి వరసిద్ధి వినాయకుని సన్నిధిలో ఎమ్మెల్యే పూజలు
మనోరంజని ప్రతినిధి తానుర్ సెప్టెంబర్ 05
నిర్మల్ జిల్లా తానుర్ మండలంలోని భోసి గ్రామంలో వరసిద్ధి వినాయకుని సన్నిధిలో ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ పూజలు నిర్వహించి హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా స్వాగతించి శాలువాతో సత్కరించారు. గణేష్ వేడుకలను అందరు కలిసి భక్తి ప్రపత్తులతో జరుపుకోవడం సంతోషకరమన్నారు. విగ్నేశ్వరుడు అందరి విగ్నలు తొలగించాలని ఆకాంక్షించారు. గతంలో ఇచ్చిన మాట ప్రకారం శివాలయంలో సిసి పూర్తి చేయడం జరిగిందని దశలవారీగా గ్రామ అభివృద్ధికి పాటుపడతానని చెప్పారు. కార్యక్రమంలో ఆయన వెంట నాయకులు సాంవ్లీ రమేష్,చిన్నారెడ్డి, తదితరులు ఉన్నారు.