గడ్డెన్న వాగు ప్రాజెక్ట్ నీటి విడుదల చేసిన ఎమ్మెల్యే*

*గడ్డెన్న వాగు ప్రాజెక్ట్ నీటి విడుదల చేసిన ఎమ్మెల్యే*

మనోరంజని ప్రతినిధి భైంసా ఆగస్టు 05
గడ్డెన్న వాగు ప్రాజెక్ట్ ప్రధాన కాలువ ద్వారా సాగు నీటిని మంగళవారం ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ విడుదల చేసారు. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి లో నిండక పోయినప్పటికీ ప్రస్తుతం వరి నాట్ల సమయం కావడం తో రైతుల సమస్య ను దృష్టిలో ఉంచుకోని నీటిని విడుదల చేయడం జరిగిందన్నారు. కుంసరా, కామోల్, పుస్పూర్, తో పాటు పలు గ్రామాల రైతులకు నీటి విడుదల వల్ల ఉపయోగకరంగా ఉంటుందన్నారు. వర్షాలు పుష్కలంగా కురిసి ప్రాజెక్ట్ లు చెరువు లు నిండి పంటలు పండాలని అయన ఆకాంక్షించారు. కార్యక్రమం లో ప్రాజెక్ట్ ఇ. ఇ. అనిల్, మాజీ ఎం. పి. పి. రజాక్, సీనియర్ నాయకులు సొలంకి భీమ్ రావ్ పటేల్, పి. ఎ. సి ఎస్ డైరెక్టర్ వడ్నపు శ్రీనివాస్, బిజెపి పట్టణ అధ్యక్షులు రావుల రాము, నాయకులు రావుల పోశెట్టి, పండిత్ రావ్ పటేల్, తుమొల్ల దత్తాత్రి,అనిల్, తో పాటు ముధోల్, లోకేశ్వరం మండల నాయకులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment