వరి ధాన్యం కొనుగోలు చేయకపోతే తీవ్రస్థాయిలో అందోళన ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్

ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ వరి ధాన్యం కొనుగోలు అంశంపై మాట్లాడుతూ

ఎమ్4 న్యూస్ ( ప్రతినిధి
భైంసా : నవంబర్ 15

రైతులను ఇబ్బంది పెడితే ఊరుకునే ప్రసక్తే లేదని అధికారులు తక్షణ చర్యలు చేపట్టి, కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యాన్ని ఆపకుండా చర్యలు చేపట్టాలని లేనిపక్షంలో ఆందోళన పోరాటాలను తీవ్రతరం చేస్తామని ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ హెచ్చరించారు. శుక్రవారం తన నివాసంలో ఆయన మాట్లాడారు. అందరికంటే ముందుగా అబ్దుల్లాపూర్ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభిస్తే, రైతులను ఇబ్బంది పెట్టడం ఏంటన్నారు. రైతులంతా కలిసి రాస్తారోకో చేయాల్సి వచ్చింది అంటే అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కోత పేరుతో రైస్ మిల్లర్లు, అధికారులు వేధిస్తే బిజెపి ఆధ్వర్యంలో ఆందోళన పోరాటాలను చేపడతామన్నారు. రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ సర్కార్ రైతుని ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు.. ఇకనైనా తీరు మార్చుకోవాలని , లేనిపక్షంలో రైతుల పక్షాన ధర్నాలు రాస్తారోకోలు చేయాల్సి వస్తుందన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతుల వద్ద వరి కొన్న వెంటనే ధాన్యాన్ని తరలించే బాధ్యత అధికారులు తీసుకోవాలన్నారు.. గతం లో చేసిన తప్పిదాలు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు..సమావేశంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నారాయణరెడ్డి, బాసర మాజీ ఎంపి పి విశ్వనాధ్ పటేల్, బిజెపి జిల్లా సభ్యత్వ నమోదు కోఆర్డినేటర్ సిరం సుష్మా రెడ్డి,తదితరులు ఉన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment