దేగాం, ఇలేగాం గ్రామాల్లో దుర్గమాత అరతిలో పాల్గొన్న ఎమ్మెల్యే
మనోరంజని తెలుగు టైమ్స్ భైంసా నవంబర్ 01
భైంసా మండలంలోని దేగాం, ఇలేగాం గ్రామాల్లో బుధవారం రాత్రి జరిగిన దుర్గమాత అరతి కార్యక్రమంలో ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేను దుర్గమాత మండలి కమిటీ సభ్యులు ఘనంగా స్వాగతించి, శాలువాతో సత్కరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, “మాత ఆశీస్సులు ఎల్లప్పుడూ ప్రజలపై ఉండి, అందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలి” అని ఆకాంక్షించారు.
అరతి కార్యక్రమంలో మాజీ ఎంపీపీ అబ్దుల్ రజాక్, సీనియర్ నాయకులు సొలంకి భీంరావు, భైంసా మండల బీజేపీ అధ్యక్షురాలు సిరం సుష్మారెడ్డి, నాయకులు చంద్రకాంత్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.