ఆలూర్ లో వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం – ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి

ఎమ్4 న్యూస్ ( ప్రతినిధి ).

నిర్మల్ జిల్లా : అక్టోబర్ 22
సారంగాపూర్:

ఆలూర్ వరి కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవం


మండలంలోని ఆలూర్ లోగల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దళారులకు పంటను అమ్మి మోసపోవద్దని,ప్రభుత్వం రైతులకు మద్దతు ధర వరికి సన్నకు రూ.2,300, దొడ్లకు రూ.2,320 రూపాయలు, అలాగే ప్రభుత్వం కేటాయించిన సన్న రకాలకు రూ.500 బోనస్ అదనంగా పొందాలని తెలియజేశారు.

ఆలూర్ వరి కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవం
అనంతరం రూ.3.20 లక్షల నిధులతో బోరింగ్ తండా,మహావీర్ తండా లకు బీటి రోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేసారు.

ఆలూర్ వరి కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవం
ఈ కార్యక్రమంలో ఆలూర్ సొసైటి చైర్మన్ మాణిక్ రెడ్డి, వైస్ చైర్మన్ లక్ష్మీ నారాయణ మార్కెట్ చైర్మన్ అబ్దుల్ హాది బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు సత్య నారాయణ గౌడ్,రావుల రామ్ నాథ్, వడ్డే రాజేందర్ రెడ్డి,చంద్ర ప్రకాష్ గౌడ్,చెన్న రాజేశ్వర్,గంగారెడ్డి, మండల కన్వీనర్ కారేపే విలాస్, బడి పోతన్న,సాధు రామ్ రెడ్డి,రాజు రెడ్డి, రైతులు పాల్గొన్నారు

Leave a Comment