సారంగాపూర్ ప్రీమియర్ లీగ్ విజేతలకు బహుమతులు అందజేసిన ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి
జాం గ్రామంలో ఘనంగా జరిగిన క్రీడా ముగింపు వేడుక — విజేత జట్లకు ట్రోఫీలు, బహుమతులు
నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం జాం గ్రామంలో నిర్వహించిన సారంగాపూర్ ప్రీమియర్ లీగ్ విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పాల్గొని విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు.
ఈ క్రీడా పోటీల్లో రాంసింగ్ తండా జట్టు విజేతగా నిలవగా, స్వర్ణ గ్రామ జట్టు రన్నరప్‌గా నిలిచింది. అనంతరం ఎమ్మెల్యే సమీపంలోని దుర్గా దేవి ఆలయాన్ని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు చంద్రప్రకాష్ గౌడ్, తక్కల రమణ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి కరిపే విలాస్, మండల అధ్యక్షులు నరేష్, నాయకులు రాంశంకర్ రెడ్డి, గంగారెడ్డి, సాహెబ్ రావ్, మండల ఉపాధ్యక్షులు తిరుమల చారి, చెన్న రాజేశ్వర్, రాజలింగం, లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.