ఎన్టీఆర్ క్రీడా వికాస కేంద్రాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది : ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి
ఈరోజు శ్రీకాళహస్తి పట్టణంలోని స్వామి వివేకానంద ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద శాప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రీడా వికాస కేంద్రాన్ని షాప్ చైర్మన్ రవి నాయుడు తో కలిసి ప్రారంభించిన శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి
👉 బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం ఈ క్రీడా మైదానాన్ని మరియు ఇండోర్ కేంద్రాన్ని నిర్వీర్యం చేయగా కూటమి ప్రభుత్వం రాగానే దీనిపై దృష్టి సారించి దీనిని ఆధునీకరించి ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు
👉 షాప్ చైర్మన్ రవి నాయుడు మాట్లాడుతూ శ్రీకాళహస్తిలో క్రీడా వికాస కేంద్రాన్ని బాగుపరిచి దానికి కావాల్సిన మరమ్మత్తులకు నిధులు,పరికరాలు కావాలని పట్టు పట్టి మరి ఆచరణలోకి తీసుకువచ్చిన శ్రీ కాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి గారు అని తెలిపారు, గతంలోనే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి దీనికి పునాదివేయగా వారి కుమారుడు సుధీర్ రెడ్డి ముందుకు తీసుకువెళ్లడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు,అధికారులు,క్రీడా అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు