- ముధోల్ మండలంలోని పలు గ్రామాల్లో తాగునీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు
- మీషన్ భగీరథ నీరు వ్యవసాయ పొలాలకు అక్రమంగా మళ్లింపు
- అధికారులు నిర్లక్ష్యంతో ప్రజలకు తాగునీరు అందని ద్రాక్షగా మారిన పరిస్థితి
- హిప్నేల్లి గ్రామ ప్రజలు గత వారం రోజులుగా నీటి కోసం నానా కష్టాలు
నిర్మల్ జిల్లా ముధోల్ మండలంలో మీషన్ భగీరథ నీరు ప్రజలకు అందకుండా, అధికారుల నిర్లక్ష్యంతో వ్యవసాయ పొలాలకు మళ్లుతోంది. బోరిగాం గ్రామ బాలాజీ గుట్ట వద్ద, హిప్నేల్లి గ్రామ సమీపంలో కొందరు రైతులు అక్రమంగా నీటిని వాడుతున్నారు. దీంతో గ్రామాల్లో తాగునీటి కోసం ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. జిల్లా ఉన్నత అధికారులు దీనిపై తక్షణమే స్పందించాలని స్థానికులు కోరుతున్నారు.
నిర్మల్ జిల్లా ముధోల్ మండలంలోని పలు గ్రామాల్లో తాగునీటి సమస్య ఉధృతమవుతోంది. అధికారుల నిర్లక్ష్యంతో మీషన్ భగీరథ ద్వారా సరఫరా అయ్యే నీరు ప్రజలకు అందకుండా వ్యవసాయ పొలాలకు మళ్లిపోతోంది. మండలంలోని బోరిగాం గ్రామంలో బాలాజీ గుట్ట సమీపంలోని రైతులు మొక్క జొన్న పంటలకు మీషన్ భగీరథ నీటిని వాడుతున్నారు. అదే విధంగా, హిప్నేల్లి గ్రామ సమీపంలో మరికొంత మంది రైతులు అక్రమంగా మెయిన్ పైప్‌లైన్లకు అనుసంధానం చేసుకుని పంట పొలాలకు నీరు తీసుకుంటున్నారు.
వేసవి రాకతో మండలంలోని పలు గ్రామాల్లో నీటి కొరత తీవ్రంగా ఉంది. హిప్నేల్లి గ్రామంలో ప్రజలు గత వారం రోజులుగా తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. న్యూ అబాది నుంచి పాత ఊరికి కాలినడక వెళ్లి నీటిని తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఈ అక్రమ జల వినియోగాన్ని అధికారులు పట్టించుకోకపోవడం ప్రజల్లో తీవ్ర ఆగ్రహానికి దారి తీస్తోంది. తక్షణమే జిల్లా ఉన్నత అధికారులు స్పందించి, గ్రామాలకు తాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.