ట్యాపింగ్ ఆరోపణలను ఖండించిన మంత్రులు
TG: CM రేవంత్ పై KTR చేసిన ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలను Dy.CM భట్టి, మంత్రులు ఉత్తమ్, పొంగులేటి ఖండించారు. ఎవరి ఫోన్లను తమ ప్రభుత్వం ట్యాప్ చేయడం లేదని, KTR దగ్గర ఏదైనా సమాచారం ఉంటే పంపించాలన్నారు. CMను అసభ్య పదజాలంతో దూషించడాన్ని తప్పుబట్టారు. ఫోన్లు ట్యాప్ చేసి వినేంత రహస్యాలు తమ ప్రభుత్వంలో లేవని ఉత్తమ్ అన్నారు. CM పదవి కోసం తాము ఆశపడటం లేదని, మరో మూడేళ్లు రేవంతే CM అని పొంగులేటి పేర్కొన్నారు