ఆస్ట్రేలియాలోని విక్టోరియా పార్లమెంటును సందర్శించిన మంత్రి శ్రీధర్ బాబు!
మనోరంజని తెలుగు టైమ్స్ ప్రతినిధి హైదరాబాద్, అక్టోబర్ 24
ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖా మంత్రి శ్రీధర్ బాబు, శుక్రవారం విక్టోరియా పార్లమెంటును సందర్శించారు. ఈ సందర్భంగా శ్రీధర్‌బాబుకు లెజిస్లేటివ్ కౌన్సిల్ గవర్నమెంట్ విప్ లీ తార్లామిస్, పార్లమెంటరీ సెక్రటరీ షీనా వాట్ ఘన స్వాగతం పలికారు. శాసన ప్రక్రియలు, పార్లమెంటరీ గవర్నెన్స్, పబ్లిక్ అకౌంట బిలిటీపై సుదీర్ఘంగా చర్చించారు. పారదర్శకత, జవాబు దారీతనం పెరగాలంటే పౌరుల భాగస్వామ్యం కీలకమని అన్నారు మంత్రి శ్రీధర్ బాబు. టెక్నాలజీ ఆధారిత, పౌర కేంద్రిత పాలన వైపు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. తెలంగాణ – విక్టోరియా ఇన్స్టిట్యూ షనల్ కొలాబరేషన్ పెంచేందుకు చొరవ చూపుతామని మంత్రి తెలిపారు. అలాగే తెలంగాణలో అమలవుతున్న ప్రోగ్రెసివ్ లెజిస్లేటివ్ ప్రాక్టీసెస్, గవర్నెన్స్ రిఫార్మ్స్, డిజిటల్ ఇనీషియేటివ్స్‌ను విక్టోరియా ప్రతినిధులకు మంత్రి వివరించారు.ఇక… రాష్ట్రంపై విక్టోరియా నేతలు ప్రశంసల వర్షం కురిపించారు. తెలంగాణ రోల్ మోడల్ రాష్ట్రం అంటూ కొనియా డారు. ద్వైపాక్షిక సహకారం పెంపొందించేందుకు కృషి చేస్తామని ఈ సందర్భంగా విక్టోరియా ప్రతినిధులు హామీ ఇచ్చారు.