బాసరలో మంత్రి శ్రీధర్ బాబుకు ఘనస్వాగతం
🗓️ జూన్ 10, 2025 – బాసర, నిర్మల్ జిల్లా
📰 M4News

బాసర పర్యటనలో భాగంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు శుక్రవారం ఉదయం బాసర ఐఐఐటీ వసతి గృహానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకి షర్మిల మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్కలను బహుమతిగా అందించారు.
ఆ తర్వాత మంత్రి పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. తన కుటుంబ సభ్యులతో కలిసి సరస్వతీ దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
తర్వాత కలెక్టర్ అభిలాష అభినవ్ మంత్రి శ్రీధర్ బాబుకు నిర్మల్ పెయింటింగ్స్ చిత్రపటాన్ని బహుకరించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, ఆర్డిఓ కోమల్ రెడ్డి, ఈవో సుదర్శన్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
పర్యటన సందర్భంగా అన్ని ఏర్పాట్లు విజయవంతంగా నిర్వహించబడ్డాయి.