తొక్కిసలాట బాధితుడిని పరామర్శించిన మంత్రి సీతక్క

మంత్రి సీతక్క శ్రీతేజ్‌ను ఆసుపత్రిలో పరామర్శిస్తున్న దృశ్యం
  • “పుష్ప-2” మూవీ రిలీజ్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్‌ను పరామర్శించిన మంత్రి సీతక్క
  • శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని, భావోద్వేగానికి లోనైన మంత్రి
  • కుటుంబానికి ప్రభుత్వ అండ, మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక పర్యవేక్షణ

 

పుష్ప-2 మూవీ రిలీజ్ సందర్భంగా తొక్కిసలాటలో తీవ్ర గాయాలపాలైన శ్రీతేజ్‌ను మంత్రి సీతక్క కిమ్స్ ఆసుపత్రిలో పరామర్శించారు. బాలుడి ఆరోగ్య పరిస్థితిని చూసి భావోద్వేగానికి లోనై కన్నీరు పెట్టుకున్న మంత్రి, శ్రీతేజ్ తండ్రికి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం తరపున పూర్తి సహాయాన్ని అందిస్తామని, డాక్టర్లను ప్రత్యేక కేర్ తీసుకోవాలని ఆదేశించినట్లు తెలిపారు.

 

పుష్ప-2 మూవీ రిలీజ్ సందర్భంగా అల్లు అర్జున్ రాకతో జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన శ్రీతేజ్‌ను మంత్రి సీతక్క కిమ్స్ ఆసుపత్రిలో పరామర్శించారు. బాలుడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న మంత్రి, ప్రస్తుతం ఆయన వెంటిలేటర్ చికిత్స నుంచి బయటకు వచ్చాడని తెలిపారు. శ్రీతేజ్ పరిస్థితిని చూసి మంత్రి సీతక్క భావోద్వేగానికి లోనై కన్నీరు పెట్టుకున్నారు.

ఆసుపత్రి డాక్టర్లతో మాట్లాడిన మంత్రి, శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని డాక్టర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. అలాగే, బాధిత కుటుంబానికి ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని, మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి ప్రత్యేక అధికారిని నియమించి చికిత్సను పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సినిమా విడుదల సందర్భంలో జరిగిన తొక్కిసలాటలో రేవతి మరణించడం దురదృష్టకరమని, భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. శ్రీతేజ్ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి, మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు ఆదేశించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment