హైకోర్టు స్టే విధిస్తుందని ఊహించలేదు: మంత్రి పొన్నం
తెలంగాణ : హైకోర్టు మధ్యంతర స్టేపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. “స్టే అంచనాకు మించినది. ఉత్తర్వుల కాపీ అందిన తర్వాత చట్టపరంగా భవిష్యత్ చర్యలు ప్రకటిస్తాం. ప్రభుత్వం బలమైన వాదనలు వినిపించింది. కుల సర్వే, డెడికేటెడ్ కమిషన్ ద్వారా అన్ని విధాలుగా వ్యవహరించాం. స్థానిక ఎన్నికలు జరగకపోవడంతో కేంద్ర నిధులు అందడం లేదు. బీసీలకు 42% రిజర్వేషన్‌కు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. రాహుల్ గాంధీ నేతృత్వంలో సామాజిక న్యాయంతో ఎన్నికలకు వెళ్తాం” అని మంత్రి అన్నారు.