- మల్లారెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని పెళ్లికి ఆహ్వానించారు
- వివాహానికి ముఖ్యులను ఆహ్వానించిన మంత్రి
- రాజకీయ పరిణామాల గురించి నిష్కర్ష
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బిఆర్ఎస్ మాజీ మంత్రి మల్లారెడ్డి, తన మనవరాలు వివాహానికి ఆహ్వానించారు.
హైదరాబాద్: అక్టోబర్ 09
తెలంగాణ మాజీ మంత్రి మల్లారెడ్డి మరియు ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి, ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు.
ఈ సందర్భంగా, మల్లారెడ్డి తన మనవరాలికి జరిగే పెళ్లికి సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. ఈ వివాహానికి అవసరమైన ప్రముఖులను కలుసుకొని పెళ్లి పత్రికలు అందిస్తున్నారు.
“ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులను స్వయంగా ఆహ్వానించడం జరిగింది” అని మల్లారెడ్డి అన్నారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, “నా మనమరాలికి పెళ్లికి పిలిచేందుకు వచ్చాననే తప్ప ఇతర రాజకీయ పరిణామాలు ఏమి లేవు” అని పేర్కొన్నారు.